Inspirational News : A woman who became a mechanic to support her family... Tears will not stop if you know her story
Inspirational News : కుటుంబ పోషణ కోసం మెకానిక్ గా మారిన మహిళ.. ఈమె స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు.
Inspirational News : ఇది టెక్నాలజీ యుగం. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలకు కూడా సమాన హక్కులు కల్పిస్తుండటంతో మహిళలు బాగా రాణిస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కుటుంబ పోషణ కోసం మెకానిక్ గా మారింది. రోజంతా దుమ్ము దూళిలో పని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న మెకానిక్ షాపులో ఈ మహిళ పని చేస్తుంది.
ఈమె పేరు రాధ. ఈమెను అందరూ అక్కడ మెకానిక్ రాధ అని పిలుస్తుంటారు. రాధకు 16 ఏళ్ల కింద వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలాసకు వలస వచ్చిన రాధ కుటుంబం.. ఏదో ఒక పని చేయడం కోసం ఆమె భర్త మెకానిక్ షాపు పెట్టాడు. కానీ.. ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేక మెకానిక్ షాపు సరిగ్గా నడవలేదు. అలాగే.. కరోనా కాలం లో కూడా రాధ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కుంది. కోవిడ్ కాలంలో షాపులన్నీ మూసేయడంతో పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో ఏదో ఒకటి చేయాలని.. తన ఫ్యామిలీని పోషించుకోవాలని తనే మెకానిక్ షాపు ఓపెన్ చేసి మెకానిక్ గా మారాలని అనుకుంది. రోజూ మెకానిక్ షాపునకు వెళ్లి అక్కడ మెకానిక్ పనులు నేర్చుకోవడం మొదలు పెట్టింది. భర్త కూడా తనకు సాయం చేశాడు. రిపేరింగ్ ఎలా చేయాలో నేర్పించాడు. దీంతో తన భర్తతో పాటు రాధ కూడా మెకానిక్ గా కష్టపడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చాలామంది మహిళ మెకానిక్ గా చేయడం ఏంటని పెదవి విరిచినా అవన్నీ పట్టించుకోకుండా తన కుటుంబం కోసం మెకానిక్ గా మారి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్న రాధను చూసి స్థానికులు మెచ్చుకుంటున్నారు.
COMMENTS