IISER Tirupati : ISER Aptitude Test 2024 Notification Released.
IISER Tirupati : ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే.
ప్రధానాంశాలు:
- ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024.
- ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం.
- మే 13 దరఖాస్తులకు చివరితేది.
IISER Aptitude Test 2024 : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొదిద్దుకున్న స్వయంప్రతిపత్తి సంస్థ- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ (IISER) అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీఎస్, బీఎస్- ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తాజాగా ప్రకటన విడుదలైంది. ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024 ద్వారా భోపాల్, బర్హంపూర్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి వంటి ఐసర్ క్యాంపస్‌లలో అడ్మిషన్లు పొందవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి https://iiseradmission.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
IISER Aptitude Test 2024 వివరాలు :
అందిస్తున్న కోర్సులు: బీఎస్, బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ వంటి పూర్తి రెసిడెన్షియల్ ఫుల్‌టైం కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు.
బీఎస్ డిగ్రీ: ఇంజినీరింగ్ సైన్సెస్, ఎకనామిక్స్ విభాగాలను కేవలం భోపాల్ క్యాంపస్ మాత్రమే అందిస్తుంది. ఇది 4 ఏళ్ల కోర్సు.
బీఎస్-ఎంఎస్ డిగ్రీ: ఇది 5 ఏళ్ల డిగ్రీ కోర్సు. దీనిలో బయోలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ అండ్ క్లయిమేట్ సైన్సెస్/ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఎకనామిక్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్, జియోలాజికల్ సైన్సెస్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్డి సిప్లినరీ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ విభాగాలు ఉన్నాయి.
సీట్ల సంఖ్య : బీఎస్ (ఇంజినీరింగ్ సైన్స్)- 60, బీఎస్ (ఎకనామిక్ సైన్సెస్)- 30, బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ- 1748 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ/ ఎస్టీలకు 55 శాతం)తో ఇంటర్మీడియట్ (సైన్స్ స్ట్రీమ్)/ 12వ తరగతి 2022/ 2023/ 2024లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 1, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 13, 2024
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహణ తేదీ: జూన్ 9, 2024.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS