Are you tired of mosquitoes? Get rid of them like this.
దోమల బెడదతో విసిగెత్తి పోయారా.. ఇలా తరిమేయండి..
భారతదేశంలోని దాదాపు ప్రతి నగరంలో వాతావరణం మారిపోయింది. ఇక్కడి అనేక నగరాల్లో వేసవికాలం మొదలైంది. దీంతో పాటు దోమల సందడి కూడా పెరిగిపోయింది.
దోమల కారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటి వెలుపల ఆడటానికి పంపించేందుకు సంకోచిస్తుంటారు. ఎందుకంటే పిల్లలలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. తద్వారా వారు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. దోమలు కుట్టడం వల్ల చర్మం ఎర్రగా మారడమే కాకుండా డెంగ్యూ, మలేరియా, జ్వరం వంటి సమస్యలతో బాధపడవచ్చు.
దోమలను తరిమికొట్టడానికి మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి దోమలను తరిమేయడంతో పాటు మనిసి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా పిల్లలు దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. అందుకే కొంత మంది సహజసిద్ధమైన పద్ధతిలో దోమలను తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. మారుతున్న వాతావరణంతో మీరు కూడా దోమల బెడదతో బాధపడుతున్నట్లయితే, ఈ చిట్కాలను ప్రయత్నించడం.
దోమల నివారణకు చిట్కాలు..
చలికాలం ముగియగానే దోమల బెడద ఎక్కువవుతుంది. చాలా సార్లు పిల్లలు ఆడుకుంటూ ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచుతారు. దాని కారణంగా దోమలు ఇంట్లోకి చోరబడి మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సాయంత్రం టీవీ చూస్తున్నప్పుడు లేదా రాత్రి నిద్రపోతున్నప్పుడు దోమలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మీరు కోరుకుంటే నిమ్మకాయ, ఆవాల నూనెను ఉపయోగించాలి.
ఒక పండిన నిమ్మకాయ, 5 లవంగం మొగ్గలు తీసుకొని పత్తితో వత్తిని తయారు చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ వత్తితో పాటు కర్పూరం వేసి ఆవాల నూనె కలపాలి. తర్వాత ఓ నిమ్మకాయలు కట్ చేసి దాని నుండి మొత్తం రసాన్ని తీయాలి. ఖాళీ నిమ్మకాయ ముక్కలో కర్పూరం, లవంగం, ఆవాల నూనె పోయాలి. ఇప్పుడు ఈ బోలు నిమ్మకాయలో ఒక వత్తి వేసి ముట్టించండి. దానిని ముట్టించిన తర్వాత ఇంటి కిటికీలు, తలుపులు అన్నీ మూసివేయాలి. తద్వారా దాని పొగ ఇంటి లోపల ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించి ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి. మీరు కొంత వ్యవధిలో తేడాను చూడగలరు.
COMMENTS