Sangareddy boy who shined in JEE.. All India first rank..
జేఈఈలో మెరిసిన సంగారెడ్డి కుర్రాడు.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్..
తల్లి ఉపాధ్యాయురాలు తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్.. వారిద్దరి ఆశయాలకు అనుగుణంగా ఈ కుర్రాడు చదువులో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందాడు. అది ఎలాగో ఇక్కడ పూర్తి వివరాలను తెలుసుకోండి.
ఇటీవల విడుదలైన జేఈఈ ఫలితాలలో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచాడు ఈ కుర్రాడు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్ చెల్మ గ్రామానికి చెందిన ఈ కుర్రాడు జాతీయస్థాయిలో జేఈఈ ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించాడు. దీనితో వారి గ్రామంతో పాటు, వారి కుటుంబంలో సైతం హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ఆ కుర్రాడి పేరు ఏమిటో తెలుసా అదేనండి విదిత్….
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్ చల్మాకు చెందిన అనిల్ కుమార్, మమత దంపతుల కుమారుడే హుండేకర్ విదిత్. విదిత్ బాల్యం నుండే చదువులో రాణిస్తూ ఉపాధ్యాయులతో ప్రత్యేక ప్రశంసలు పొందుతూ వస్తున్నాడు. ఒకటో తరగతి నుండి ఏడవ తరగతి వరకు జహీరాబాద్ లో, ఏడవ తరగతి నుండి ఇంటర్ వరకు హైదరాబాద్ లోని నారాయణ విద్యాసంస్థల్లో విదిత్ తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అయితే ఎలాగైనా తన తల్లిదండ్రులు కలలు గన్న ఆశయాలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకున్న ఈ విద్యార్థి జెఈఈ పరీక్షలకు సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలో ప్రతిరోజు 15 గంటల పాటు ప్రాణాళికా బద్ధంగా చదివి చివరకు తను అనుకున్న విజయాన్ని అందుకున్నాడు. అదేనండి జాతీయస్థాయిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించి అందరిని అబ్బురపరిచాడు. ఈ సందర్భంగా లోకల్ 18 తో సదరు విద్యార్థి విదిత్ మాట్లాడుతూ… తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. అలాగే మరింతగా శ్రమించి రానున్న రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన ముందున్న లక్ష్యంగా సదరు విద్యార్థి తెలిపాడు. మరి సంగారెడ్డి జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ విద్యార్థి ని మనం అందరం అభినందిద్దాం.
COMMENTS