PM Kisan: Good news for farmers.. Do you know PM Kisan 16th episode..?
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 16వ విడత ఎప్పుడో తెలుసా..?
దేశంలోని రైతులకు మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ముఖ్యంగా రైతులకు అండగా ఉండే పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఇందులో రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది. ఈ డబ్బులు ఒకే సారి కాకుండా ఏడాదిలో మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఈ పథకం కింద ఇప్పటి వరకు దేశంలోని కోట్లాది మంది రైతులు 15 విడతల్లో ప్రయోజనం పొందారు. దేశంలోని రైతులు 16వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా అంటే ఫిబ్రవరి 27న 16వ భాగం విడుదల కానుందని విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే ఈ పీఎం కిసాన్ కింద రైతులకు ఏడాది పొడవునా మూడు విడతలుగా రూ.2000 చొప్పున అందిస్తుండగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచే ఆలోచనలో ఉంది కేంద్రం. ఈ మొత్తాన్ని పెంచినట్లయితే , రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. PM కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందేందుకు eKYC చాలా ముఖ్యం. మీరు e-KYC చేయకుంటే మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోవచ్చు. ఇకేవైసీ చేయని వారు వెంటనే చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికే కేవైసీ చేయని రైతులకు 15వ విడత డబ్బులు అందలేదు. కేవైసీ కోసం మీ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో గానీ, ఇతర ఆన్‌లైన్ సెంటర్‌ను సందర్శించి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. లేదా మీరు ఇంట్లో ఉండి కూడా మీ మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. లేదా బ్యాంక్ నుండి లేదా అధికారిక పోర్టల్ pmkisan.gov.in నుండి పూర్తి చేయవచ్చు. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేయకపోతే 16వ విడత నిలిచిపోవచ్చు. దీనితో పాటు, పథకం కింద లబ్ధిదారులైన రైతులు భూ ధృవీకరణ చేయించుకోవడం అవసరం. ఎవరైనా ఈ పనిని పూర్తి చేయకపోతే వచ్చే విడత డబ్బులు నిలిచిపోవచ్చు.
ఈ రైతులకు పీఎం కిసాన్ ప్రయోజనం లేదు
ఒక రైతు మరో రైతు నుంచి భూమి తీసుకుని కౌలుకు వ్యవసాయం చేస్తే, అతనికి ఈ పథకం ప్రయోజనం ఉండదు. పీఎం కిసాన్‌లో భూమిపై యాజమాన్యం అవసరం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రకారం, భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందలేరు. ఎవరైనా ఇలా చేస్తే అది నకిలీదని ప్రభుత్వం ప్రకటించి రికవరీ చేస్తుంది. ఇది కాకుండా, రైతు కుటుంబంలో ఎవరైనా పన్ను చెల్లిస్తే, అతను ఈ పథకం ప్రయోజనం పొందలేడు. అంటే, భర్త లేదా భార్యలో ఎవరైనా గత సంవత్సరం ఆదాయపు పన్ను చెల్లించినట్లయితే వారు ఈ పథకం ప్రయోజనం పొందలేరు.
ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి
రైతుల కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దరఖాస్తు చేసుకున్నట్లయితే దాని స్థితిని తెలుసుకోవడానికి మీరు 155261కి కాల్ చేయవచ్చు. మీరు దీని గురించి అన్ని రకాల సమాచారాన్ని పొందవచ్చు.
COMMENTS