Car Tips: Do you know the meaning of the red light on the side mirror of the car? What is this alert for?
Car Tips: కారు సైడ్ మిర్రర్ మీద ఉండే రెడ్ లైట్‌కి అర్థం తెలుసా? ఈ అలర్ట్ దేనికోసం?
ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌ను జోడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నుంచి కస్టమర్లను రక్షించేందుకు కార్ల తయారీదారులు అధునాతన భద్రతా ఫీచర్లను జోడిస్తున్నారు. ఇప్పుడు వాహనాలు శక్తివంతమైన ఫీచర్లను పొందుతున్నాయి. వాహనాల్లో కనిపించే (ADAS-Advanced driver assistance systems) వ్యవస్థలు రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహాయపడే అనేక అధునాతన భద్రతా ఫీచర్స్‌ను పొందుపరుస్తున్నాయి కంపెనీలు. ఈ రోజు మనం వాహనాల్లో కనిపించే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు డ్రైవర్‌కు ఎలా సహాయపడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం.
బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది?
కంపెనీ ఈ అధునాతన భద్రతా ఫీచర్‌ను మీ కారులో చేర్చినట్లయితే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనుక నుండి మరొక కారు వచ్చినప్పుడు ఈ ఫీచర్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. మీరు లేన్లను మారుస్తున్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ బ్లైండ్ స్పాట్ ప్రాంతాన్ని గుర్తిస్తుంది. వాహనం వెనుక నుండి మీ కారు వద్దకు చేరుకుంటే మీ కారు లోపల లేదా మీ కారు సైడ్ మిర్రర్లలో రెడ్ లైట్ వస్తుంది. ఈ లైట్‌ని చూడటం ద్వారా మీరు దీన్ని డేంజర్ బెల్గా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ మీకు వెనుక నుండి మరొక వాహనం వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో మీరు లేన్లను మార్చవద్దని హెచ్చరిస్తోంది. దీని వల్ల ప్రమాదాలు జరుగకుండా చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ అన్ని వాహనాల్లో అందుబాటులో ఉందా?
పాత వాహనాల్లోనే కాదు.. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న చాలా కొత్త వాహనాలు ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి. బ్లైండ్ స్పాట్ అలర్ట్ సిస్టమ్ ప్రయోజనాల గురించి మాట్లాడితే.. ఇది లేన్లను మార్చేటప్పుడు, తిరిగేటప్పుడు డ్రైవింగ్‌ను సురక్షితంగా చేస్తుంది. అంతే కాకుండా, ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది.
జాగ్రత్త కూడా అవసరం
వాహనంలో అందించిన బ్లైండ్ స్పాట్ అలర్ట్ సిస్టమ్ మంచిదే కానీ పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడటం మంచిది కాదు. మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఫీచర్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుందని భావించవద్దు. వాహనం నడుపుతున్న సమయంలో ఎప్పుడు కూడా ఫీచర్స్పై ఆధారపడకుండా మీఅంతటి మీరే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
COMMENTS