SCCL Notification 2024: Good news for unemployed.. Notification released for filling 272 posts in Singareni
SCCL Notification 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల .
మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులకు మార్చి 18వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు. వైద్యాధికారి పోస్టులకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. మిగిలిన అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగాలు నిర్వహిస్తోన్న వారికి మాత్రం వయోపరిమితిలో ఎలాంటి మినహాయింపు లేదని ప్రకటనలో స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మార్చి 1వ తేదీన విడుదల చేసే నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలని, ఇతర పూర్తి వివరాలకు సింగరేణి సంస్థ వెబ్‌సైట్ లోని ‘కెరీర్’విండోను సందర్శించాలని సంస్థ యాజమాన్యం అభ్యర్ధులకు సూచించింది
కాగా బుధవారం నాడు సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై సంస్థ సీఎండీతో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యేడాది సింగరేణిలో వెయ్యి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలని సూచించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల నేపథ్యంలో సింగరేణిలో నియామకాలపై సీఎండీ నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమాపై యూబీఐతో ఒప్పందం సైతం చేసుకుంటామని సీఎండీ బలరామ్ తెలిపారు.
Important Links:
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS