New Business Idea: Really cool bread recipes.. for just Rs.5..
New Business Idea: అస్సలు సిసలైన పిండి వంటకాలు.. కేవలం రూ.5 లకే..
ఆ ప్రాంతంలో అసలు సిసలైన ఆంధ్రా పిండి వంటకాలు ఉంటాయి. నిజానికి ఆ పిండి వంటకాల పేరుతో ఆ ప్రాంతమే సువాసనతో విరజిల్లుతుందట.
ఆ ప్రాంతంలో అసలు సిసలైన ఆంధ్రా పిండి వంటకాలు ఉంటాయి. నిజానికి ఆ పిండి వంటకాల పేరుతో ఆ ప్రాంతమే సువాసనతో విరజిల్లుతుందట. ఆ ప్రాంతంలోనే ఎక్కువగా పిండి వంటకాలు ఎందుకు కొనుగోలు చేస్తారంటే అప్పుడే తయారుచేసి అప్పుడే అమ్మకాలు వారి ముందే చేస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున ఆ పిండికి వంటకాలపై ఆ ప్రాంతవాసులు ముక్కువ చూపుతారు.
అంతేకాదు అతి తక్కువ ధరలకు నోరూరించే ఆ పిండి వంటకాలు అక్కడ మహిళ అందిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది అంత ఆకట్టుకున్న ప్రదేశం వివరాలు ఏంటి ఒకసారి చూద్దాం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ నగరం అది. కాకినాడకు సంబంధించి అనేక రకాల హంగులు ఆర్భాటాలతో కూడిన అనేక దుకాణాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు సిసలైన ఆంధ్ర పిండి వంటకాలు పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.
అయితే అందులో ప్రధానమైనది సినిమా రోడ్లో ఉన్న ఈ పిండి వంటక బండి అని చెప్పుకోవచ్చు. అక్కడ మహిళ తనదైన శైలిలో అక్కడే వంటకాలు వండుతూ అక్కడే అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు. తక్కువ ధరలకు నోరూరించే పిండి వంటకాలు అప్పటికప్పుడే అందించడంతో కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుంటూ ఉంటారు.
ఆంధ్ర పిండి వంటకాలు అందులోనూ అరిసెలు అంటే అసలు చెప్పనవసరమే లేదు. ఎందుకంటే చూడటానికి ప్రత్యేక అట్రాక్షన్ గా ఎక్కడైనా అరిసెలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ దుకాణంలో మరింత అట్రాక్షన్ గా ఈ అరిసెలు అరిసెలతో పాటు జంతికలు వెన్నప్పాలు, పోకుండాలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి.
అక్కడ తీసుకునే కేరింగ్ లేక మరేమిటో తెలీయదు గానీ ఆ రహదారిపై వెళుతూ వెళుతూ ఉన్నప్పుడే ఈ మధుర వంటకాల సువాసన ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. దీంతో అలా వెళ్లే ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు చేద్దామా వద్దా అన్న తరుణంలో కూడా ఈ సువాసన వారిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న తరుణంలో ఖచ్చితంగా కొనుగోలు చేస్తూ ఉంటుంటారు.
నోరూరించే పోకుండా నిజానికి మన దేహానికి ఎంతో ఐరన్ ఫుడ్ అయినా నువ్వులతో చేస్తూ ఉంటారు. కేవలం ఐదు రూపాయలకే ఒక్కొక్క పోకుండా సంబంధించినవి నిర్వాహకులు అమ్మకాలు చేస్తూ ఉంటారు.
అదేవిధంగా జంతిక ₹10 అదేవిధంగా అరిసె కూడా ₹10 కు ఒక్కొక్కటి అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు.ముఖ్యంగా ఇంట్లో తినే వారి సంఖ్య కన్నా నివాసాల్లో చేసుకునే ఫంక్షన్లు లేక మనం చుట్టాలు ఇంటికి వెళ్లేటప్పుడు తీసుకు వెళ్లే క్రమంలో గాని ఎక్కువగా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి పార్సిల్స్ తీసుకు వెళ్తూ ఉంటారు.
వారి పార్సిల్ బట్టి అప్పుడే వారు వేడివేడిగా తయారు చేసి అమ్మకాలు చేస్తుంటారు.కొనుగోలు చేసేందుకు కాకినాడ నగరవాసులే కాదు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కాకినాడ చేరుకున్న పలువురు కూడా వీటిని కొనుగోలు చేసి వారి గ్రామాలకు తీసుకెళ్తూ ఉంటారు.
ఇక మరికొన్ని రోజుల్లో సంక్రాంతి వస్తున్న తరుణంలో షాపింగ్ అంటేనే కాకినాడ కాకినాడ అంటేనే షాపింగ్ అని చెప్పుకోవచ్చు ఇప్పటినుంచే దుకాణాలన్నీ కిటకిటలాడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి వచ్చిన పలువురు కూడా ఈ పిండి వంటకాలు నోరూరించే పిండి వంటకాలు చూసి పలువురికి చెప్పడమే కాదు. ఇక్కడ తీసుకువెళ్లి స్వయంగా వారికి రుచి చూపించడంతో ఈ ఖ్యాతి మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ పిండి వంటకాలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి.. కాకినాడలో కనిపిస్తుంది కాకినాడలోనే ఈ దుకాణం మంచి ఆదరణ పొందుతుంది అని కూడా చెప్పుకోవచ్చు.
COMMENTS