Saving Scheme: With an investment of just Rs.7 per day.. Every month income of Rs.5 thousand.. This scheme promises..
Saving Scheme: రోజు కేవలం రూ.7 పెట్టుబడితో.. ప్రతి నెలా రూ.5వేల ఆదాయం.. ఈ స్కీమ్ అదుర్స్..
Saving Scheme: తక్కువ ఆదాయం అందుకునే వ్యక్తులు కూడా రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేయవచ్చు. ఇలాంటి వారికి ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్కీమ్ అటల్ పెన్షన్ యోజన (APY).
భారతదేశంలో రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేసే వారు చాలా తక్కువ. కానీ ఇటీవల పదవీ విరమణ కోసం ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రిటైర్‌మెంట్ కోసం ఒకేసారి పెద్ద మొత్తంతో అమౌంట్ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత త్వరగా సేవింగ్స్ ప్రారంభిస్తే, పదవీ విరమణ సమయంలో అంత ఎక్కువ సంపద పొందవచ్చనే గోల్టెన్ రూల్ ఫాలో అయితే సరిపోతుంది.
తక్కువ ఆదాయం అందుకునే వ్యక్తులు కూడా రిటైర్‌మెంట్ ప్లానింగ్ చేయవచ్చు. ఇలాంటి వారికి ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్కీమ్ అటల్ పెన్షన్ యోజన (APY). ఇందులో రోజుకు రూ.7 పెట్టుబడితో ప్రతి నెలా రూ.5 వేల పెన్షన్ అందుకోవచ్చు.
అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అసంఘటిత రంగంలోని వ్యక్తుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు, వృద్ధాప్యంలో ఆర్థిక తోడ్పాటు అందించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. రోజువారీ వేతన జీవులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, చిన్న తరహా వ్యాపారులకు అధికారిక పెన్షన్ స్కీమ్ లేని కొరతను అటల్ పెన్షన్ యోజన తీర్చింది. రిటైర్‌మెంట్ వయసు తర్వాత ఎంత పెన్షన్ అందుకోవాలి అనేదాన్ని బట్టి స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
* అటల్ పెన్షన్ యోజన ఎలా పని చేస్తుంది?సామాన్య ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాల్లోనే పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ప్రభుత్వ పెన్షన్ పథకాల్లో సేఫ్, సెక్యూర్ రిటైర్‌మెంట్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి అటల్ పెన్షన్ యోజన ఆశాదీపంగా మారింది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఆర్కిటెక్చర్ ద్వారా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహణలో పనిచేస్తుంది.
* రూ.7 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.5,000 పెన్షన్‌ఉదాహరణకు మీరు 18 సంవత్సరాల వయస్సు నుంచి అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు అనుకుందాం. రోజుకు కేవలం రూ.7 ఇన్వెస్ట్ చేస్తే చాలు, 60 సంవత్సరాల వయస్సులో నెలవారీ రూ.5,000 పెన్షన్‌ను పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన ద్వారా నెలవారీ రూ.5,000 పెన్షన్‌ను అందుకోవాలంటే, నెలకు రూ.210 డిపాజిట్ చేయాలి. అంటే రోజుకు రూ.7 పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ స్కీమ్ కొంచెం ఆలస్యంగా చేరిన వారికి కూడా మెరుగైన ప్రయోజనాలు అందిస్తుంది.
* అర్హత ప్రమాణాలు18 నుంచి 40 సంవత్సరాల భారతీయ పౌరులు ఎవరైనా అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం 20 సంవత్సరాల పాటు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాలి. పెన్షన్ 60 సంవత్సరాల వయస్సు నుంచి ప్రారంభమవుతుంది. ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్, వ్యాలీడ్ మొబైల్ నంబర్ కూడా అవసరం. పన్ను చెల్లింపుదారులు అయి ఉండకూడదు.
* ఎలా అప్లై చేసుకోవాలి?అటల్ పెన్షన్ యోజన ఫారమ్‌లు ఆన్‌లైన్‌లో, నేషనల్ బ్యాంకుల వద్ద లభిస్తాయి. అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అన్ని బ్యాంకులు ఈ పథకాన్ని ఆఫర్ చేస్తున్నా, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం లేదు. నేరుగా బ్యాంక్‌కి వెళ్లి, అప్లికేషన్ పూర్తి చేసి, సబ్మిట్ చేయాలి.
COMMENTS