IRCTC Ooty Tour: Ooty Trip in Winter... Amazing Package from IRCTC
IRCTC Ooty Tour: వింటర్‌లో ఊటీ ట్రిప్... ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ప్యాకేజీ
IRCTC Ooty Tour: వింటర్‌లో ఊటీ ట్రిప్... ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ప్యాకేజీ.
శీతాకాలంలో ఊటీ ట్రిప్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) అద్భుతమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఊటీ అన్‌లిమిటెడ్ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు కొయంబత్తూర్‌లో ఆదియోగి స్టాచ్యూతో పాటు, ఊటీ, కూనూర్ అందాలు చూడొచ్చు. 2024 జనవరి 25న ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. ఫ్లైట్‌లో పర్యాటకుల్ని హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి, కొయంబత్తూర్, కూనూర్, ఊటీ చూపించనుంది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే మొదటి రోజు ఉదయం 7.45 గంటలకు కొయంబత్తూర్ ఫ్లైట్ ఎక్కాలి. కొయంబత్తూర్ చేరుకున్న తర్వాత ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఊటీ బయల్దేరాలి. రాత్రికి ఊటీలో బస చేయాలి.
రెండో రోజు ఊటీ టూర్ ఉంటుంది. దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ చూడొచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి. మూడో రోజు పైకారా ఫాల్స్, ఫిల్మ్ షూటింగ్ పాయింట్స్, ముదుమలై నేషనల్ పార్క్ చూడొచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి.
నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ ఉంటుంది. కూనూర్ సిమ్స్ పార్క్, ల్యాంబ్స్ రాక్ చూడొచ్చు. సాయంత్రం 6.35 గంటలకు కొయంబత్తూర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.24,850, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.25,450, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.32,600 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, మూడు రాత్రులు ఊటీలో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
COMMENTS