Sachin Tendulkar: Sachin made a profit of 19 crores in 9 months.. This is the share that is raining cash before the listing
Sachin Tendulkar: సచిన్‌కు 9 నెలల్లో 19 కోట్ల లాభం.. లిస్టింగ్‌కు ముందే కాసుల వర్షం కురిపిస్తున్న షేర్ ఇదే
Sachin tendulkar: సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేసిన ఓ కంపెనీ స్టాక్ మార్కెట్లో దుమ్మురేపుతోంది. ఇంకా లిస్టింగ్‌కు రాకముందే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. 9 నెలల క్రితం 5 కోట్లు పెట్టిన సచిన్‌కు ఏకంగా రూ. 19 కోట్ల లాభం తెచ్చిపెట్టింది.
గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు మంచి లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఐపీవోలు కూడా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇన్వెస్ట్ చేసిన ఓ కంపెనీ సైతం ఐపీవోకి వచ్చేసింది. దాని సబ్‌స్క్రిప్షన్ కోసం ఊహించని రెస్పాన్స్ వచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ ఐపీఓకి వచ్చింది. ఈ కంపెనీ షేర్ల కోసం మంచి రెస్పాన్స్ వచ్చింది. సెంబర్ 22న సబ్‌స్క్రిప్షన్ డేట్లు ముగియగా..80.65 రెట్ల మేర సబ్‌స్క్రిప్షన్ జరిగింది.
ప్రస్తుతం అందరూ అలాట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 26న ఆజాద్ ఇంజినీరింగ్ షేర్ల అలాట్‌మెంట్ జరిగే అవకాశముంది. ఆ తర్వాత డిసెంబరు 28న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. ఈ కంపెనీ షేర్ ఇష్యూ ధర రూ.499-524గా ఉంటే.. గ్రే మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 375 ప్రీమియంతో ఉంది.
ఐతే ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ ఐపీవో లిస్టింగ్‌కు రాకముందే సచిన్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ కంపెనీలో 9 నెలల కింద సచిన్ పెట్టుబడి పెట్టారు. ఒక్కో షేరుకు రూ.114.1 చొప్పున మొత్తం.. 438210 షేర్లను రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.
ప్రస్తుతం ఈ షేరు ఐపీవో కోసం ధరల శ్రేణిని గరిష్టంగా రూ.524 గా నిర్ణయించింది. సచిన్ కొన్న ధర కంటే ఇది 4.59 రెట్లు అధికం. ఈ లెక్కన సచిన్ పెట్టిన రూ.5 కోట్ల పెట్టుబడి విలువ ఇప్పుడు 23 కోట్లకు పెరిగింది. కేవలం 9 నెలల్లోనే 19 కోట్ల లాభం వచ్చింది.
లిస్టింగ్ తర్వాత ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ షేర్ విలువ మరింతగా పెరిగే అవకాశముంది. అదే జరిగితే.. సచిన్ టెండూల్కర్‌కి లాభాలు మరింతగా పెరగవచ్చు. సచిన్ పెట్టుబడి పెట్టిన 5 రోజుల తర్వాత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ కూడా ఇన్వెస్ట్ చేశారు.
లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నేహ్వాల్.. రూ. కోటి చొప్పున పెట్టుబడులు పెట్టగా.. అది ఇప్పుడు. రూ.2.3 కోట్లుగా మారనుంది. మొత్తంగా ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ లిస్టింగ్‌కు ముందే సచిన్‌కు భారీ లాభాలను తీసుకొచ్చింది. లిస్టింగ్ తర్వాత ఇంకెన్ని లాభాలు తెస్తుందో చూడాలి.
COMMENTS