Udyog Aadhaar: What is Udyog Aadhaar? Does it have all the benefits? Need to know full details..
Udyog Aadhaar: ఉద్యోగ్ ఆధార్ అంటే ఏమిటి? దీనిలో అన్ని ప్రయోజనాలున్నాయా? పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే..
ఆధార్ కార్డు మాదిరిగానే మరో కార్డు ఉద్యోగ్ ఆధార్ అని ఒకటి ఉంది. దీనికి గురించి బహుశా అందరికీ తెలిసుండకపోవచ్చు. ప్రస్తుతం దీనిని ఉద్యమ్ ఆధార్ అని పిలుస్తున్నారు. ఇది వ్యాపార వేత్తులకు ఇస్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకం కావాలన్నా మీరు ఈ నంబర్ ను కలిగి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ ఉద్యోగ్(ఉద్యమ్) ఆధార్ అంటే ఏమిటి? దానిని ఎలా పొందాలి? రిజిస్ట్రేషన్ ఎలా? ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..
ఉద్యోగ్ ఆధార్ ప్రయోజనాలు..
ఎంఎస్ఎంఈలకు ఎక్సైజ్ సుంకం మినహాయింపు, ఇతర పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌ల నమోదు కోసం రుసుము తగ్గింపు ఉంటుంది.
యజమానులు గ్యారంటీ లేకుండా రుణాలు, తక్కువ వడ్డీ రుణాలు, సబ్సిడీలతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు.
విదేశీ వాణిజ్యం కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందొచ్చు.
విద్యుత్ బిల్లుల్లో రాయితీ కూడా ఇస్తారు.
ఐఎస్ఓ సర్టిఫికేషన్ కు చెందిన రీయింబర్స్‌మెంట్ వస్తుంది.
లైసెన్స్‌లు, ఆమోదాలు, ఇతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ సులభతరం అవుతుంది.
ఉద్యోగ్ ఆధార్ కొత్త నిబంధనలు ఇవి.
కేంద్ర ప్రభుత్వం, జూలై 2020లో, మునుపటి ఉద్యోగ్ ఆధార్ స్థానంలో ఎంఎస్ఎంఈల కోసం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. కొత్త నిబంధనల ప్రకారం, కొత్త సంస్థలు కేవలం ఆధార్ నంబర్, స్వీయ-డిక్లరేషన్‌తో నమోదు చేసుకోవచ్చు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం పాన్ నంబర్ లేదా జీఎస్టీఐఎన్ ఆధారంగా ఎంటర్‌ప్రైజ్ వివరాలను ధ్రువీకరించవచ్చు.
ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఇలా..
ఉద్యమ్ అధికారిక వెబ్ సైట్ (https://udyamregistration.gov.in/Government-India/Ministry-MSME-registration.htm) వ్యాపారులు రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయవచ్చు.
హోమ్‌పేజీలో, ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఫారమ్ లో కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అంటే ఎంఎస్ఎంలుగా నమోదు చేయని కొత్త ఎంటర్‌ప్రైజెస్ కోసం’ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్, వ్యాపారవేత్త పేరును నమోదు చేయండి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించడానికి ఓటీపీని ధ్రువీకరించండి.
తర్వాత, మీరు మీ ఎంటర్‌ప్రైజ్ రకం, ఎంటర్‌ప్రైజ్ వివరాలను ఎంచుకోవాలి.
తుది సమర్పణ తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి నిర్ధారణ సందేశం వస్తుంది.
‘ఉద్యమ్ సర్టిఫికేట్’ ఇమెయిల్ ద్వారా మీకు అందుతుంది.
COMMENTS