TSLPRB Constable Result 2023 : Constable jobs for 17 people in one village.. All of them belong to poor families..!
TSLPRB Constable Result 2023 : ఒకే గ్రామంలో 17 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే..!
TSLPRB TS Constable Results 2023 : తెలంగాణలో ఇటీవల విడుదలైన పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ఒక ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. మారుమూల ప్రాంతమైన మంచాల మండలం నుంచి 76 మంది ఉద్యోగాలు సాధించారు. వీరిలో చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఒక్క మంచాల గ్రామం నుంచే 17 మంది ఎంపిక కావడం విశేషం. ఆరుట్ల పంచాయతీ పరిధిలో 11 మంది కానిస్టేబుల్ ఉద్యో గాలు సాధించారు. ఆగాపల్లి నుంచి నలుగురు, బండలేమూర్ నుంచి నలుగురు, అజ్జిన తండా నుంచి ఇద్దరు, చెన్నారెడ్డిగూడ నుంచి ఇద్దరు, లోయపల్లి నుంచి నలుగురు, ఎల్లమ్మ తండా నుంచి ముగ్గురు, బోడకొండ నుంచి ఐదుగురు కానిస్టేబుల్ కొలువులకు ఎంపికయ్యారు.
అలాగే.. సత్తి తండా నుంచి ఇద్దరు, కొర్రం తండా నుంచి ఇద్దరు, చీదేడ్ నుంచి ముగ్గురు, రంగాపూర్ నుంచి ముగ్గురు, వెంకటేశ్వర తండా నుంచి ఒకరు చొప్పున కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. లింగంపల్లి నుంచి ఒకరు, నోముల నుంచి ఇద్దరు, తిప్పాయిగూడ నుంచి ముగ్గురు, తాళ్లపల్లి గూడ నుంచి నలుగురు, చిత్తాపూర్ నుంచి ముగ్గురు చొప్పున కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం.
ఒక్క ఊరు.. 11 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు
పోలీస్ ఉద్యోగాల కోసం 25 మంది యువకులు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్ ప్రజాగ్రంథాలయానికి నిత్యం వెళ్లి సన్నద్ధమయ్యారు. వీరిలో 11 మంది కొలువులు సాధించారు. ఇక్కడి పుస్తకాలు చదివి ఉద్యోగాలు సాధించామని యువకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక గ్రంథాలయంలో ఉద్యోగాలు సాధించిన దొండ దివ్య, మాల శిరీష, దాసరి అజయ్, గంజి సాయిరాజ్, కొప్పుల రాజు, సంగ కుమారస్వామి, మ్యాకల రాజు, రేవెల్లి మోహన్‌ను జడ్పీటీసీ రవీందర్, సర్పంచి కొమురయ్య, గ్రంథాలయ కమిటీ నిర్వాహకులు ప్రమోద్‌రెడ్డి, ఎదులాపురం తిరుపతి, తాళ్ల వీరేశం వీరిని సన్మానించారు.
అన్న ఎస్‌ఐ.. తమ్ముడు కానిస్టేబుల్
ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు పోలీస్ కొలువులు సాధించారు. అన్న ఎస్ఐఘౄ ఎంపిక కావడంతో తమ్ముడు పట్టుదలతో సాధన చేసి రెండో ప్రయత్నంలో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన నిరుపేద గీతకార్మికుడు చింత మొగిలి-విజయ దంపతులకు ముగ్గురు కుమారులు చింత రాజు, సురేష్, మహేశ్. పిల్లలు ముగ్గురు ఉన్నత చదువులు చదివి కొలువులు సాధించారు. పెద్దకుమారుడు చింత రాజు 2008లో సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అన్నను స్ఫూర్తిగా తీసుకున్న మహేశ్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కష్టపడి చదివారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా ఈసారి ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. సురేష్ సివిల్ ఇంజినీర్‌గా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
Post a Comment