TSGENCO Chemist: 60 Chemist Jobs in Telangana Genco.. Salary up to Rs.1,31,220
TSGENCO Chemist : తెలంగాణ జెన్‌కోలో 60 కెమిస్ట్ ఉద్యోగాలు.. రూ.1,31,220 వరకూ జీతం
ప్రధానాంశాలు:
- టీఎస్ జెన్‌కో రిక్రూట్‌మెంట్ 2023
- 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన
అక్టోబర్ 29November 10 దరఖాస్తులకు చివరితేది
TSGENCO Chemist Recruitment 2023 : హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TSGENCO) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు TSGENCO ప్రకటన విడుదల చేసింది. ఎంఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 29 november 10 వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం కెమిస్ట్ పోస్టులు: 60
అర్హతలు: బీఎస్సీ(కెమిస్ట్రీ), మొదటి శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-07-2023 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.65,600 - రూ.1,31,220 వరకు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.400.
ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు ప్రారంభం: అక్టోబర్ 7, 2023.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 7, 2023.
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: అక్టోబర్ 29, november 10 , 2023.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 29, november 10 ,2023.
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 3, డిసెంబర్ 17, 2023.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
COMMENTS