Banks: Do you know how it became possible for banks to earn lakhs of crores with free online payments?
Banks: ఫ్రీ ఆన్‌లైన్ పేమెంట్స్‌తో బ్యాంకులకు లక్షల కోట్ల ఆదాయం.. ఎలా సాధ్యమైందో తెలుసా..?
ప్రస్తుతం భారతదేశంలో క్యాష్ పేమెంట్స్ కంటే ఆన్‌లైన్ చెల్లింపులే ఎక్కువగా జరుగుతున్నాయి. క్యాష్‌లెస్ ఎకానమీకి మారడం భారత ఆర్థిక వ్యవస్థలో వేగాన్నే కాదు, లాభాలను కూడా తీసుకొచ్చింది. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకు పెద్ద మొత్తంలో రాబడి వస్తోంది. ఆన్‌లైన్ పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండానే ఈ సంస్థలు లాభాలు ఆర్జిస్తున్నాయి.
లైవ్ మింట్ రిపోర్ట్ ప్రకారం, గత నెలలో భారతదేశంలో ఏకంగా 1000 కోట్లకు పైగా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ట్రెడిషినల్ క్యాష్ రిజిస్టర్లను డిజిటల్ కన్‌ఫర్మేషన్స్ భర్తీ చేశాయి. చాలా మంది కస్టమర్లకు క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది.
మొబైల్ వ్యాలెట్ల ద్వారా రూ.2,000 కంటే ఎక్కువ బిల్లులు చెల్లించే కస్టమర్లు వేరే ప్లాట్‌ఫారమ్ QR కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు మ్యాక్సిమం 1.1% ఫీజు ఛార్జ్ చేస్తారు. ఇది గూగుల్ పేతో కనెక్ట్ కావడానికి అమెజాన్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి వాటికి వర్తిస్తుంది. ప్రజలు వివిధ బ్యాంకులకు డబ్బు పంపడానికి, స్వీకరించడానికి ఉపయోగించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ట్రాన్సాక్షన్లకు ఎటువంటి ఛార్జీ ఉండదు.
బ్యాంకులు హై-వాల్యూమ్ యూజర్లపై కొన్ని ఛార్జీలు విధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీధి వ్యాపారుల వంటి వెనుకబడిన వర్గాలకు సపోర్టుగా ప్రభుత్వం లో-వ్యాల్యూ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహిస్తోంది. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్ పేమెంట్స్ నుంచి నేరుగా ప్రయోజనం పొందకుండా, వాటి వేగవంతమైన వృద్ధిని గమనిస్తూ వెనుకబడినట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఏటా దాదాపు 2 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లను నిర్వహించే ఇండస్ట్రీగా ఈ రంగం నిలుస్తోంది.
జపాన్‌కు పోటీగా భారత్:
ఫ్రీ పబ్లిక్ యుటిలిటీ అయినప్పటికీ, భారతదేశ పేమెంట్ రెవెన్యూ గత సంవత్సరం రూ.5,31,200 కోట్లకు చేరుకుంది. చైనా, యూఎస్, బ్రెజిల్ కంటే వెనుకబడి ఉంది, జపాన్‌కు సమీపంగా వచ్చింది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లలో ఈ పెరుగుదల డిజిటల్ వాణిజ్యాన్ని, క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని కూడా పెంచింది.
లాభాలు అందకపోవడం ఇన్నోవేషన్‌కి అడ్డంకిగా మారలేదు. ఒరిజినల్ ప్రోటోకాల్‌కు అనుబంధంగా ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్స్ వంటి ఇనిషియేటివ్స్ వచ్చాయి. గత సంవత్సరం నుంచి క్రెడిట్ కార్డ్‌లు లింక్ చేసే ఆప్షన్ కూడా వచ్చింది. ప్రస్తుతానికి భారతదేశ రూపే నెట్‌వర్క్‌లో ఉండే కార్డులకు మాత్రమే అవకాశం ఉంది, త్వరలో వీసా, మాస్టర్‌కార్డ్‌లను చేర్చాలని భావిస్తున్నారు.
భారతదేశం సక్సెస్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పేమెంట్ సిస్టమ్‌లకు భిన్నంగా ఉంటుంది. బ్రెజిల్ 2027 నాటికి దాని పేమెంట్ రెవెన్యూలో సగం ఇన్‌స్టంట్ పేమెంట్స్ నుంచి వస్తుందని ఆశిస్తోంది. అదే భారతదేశం రెవెన్యూ 10%కి కూడా చేరకపోవచ్చు. 2027 నాటికి 765 బిలియన్ల ట్రాన్సాక్షన్లు జరగవచ్చని అంచనా వేస్తున్నారు, ట్రాన్సాక్షన్ల వాల్యూమ్‌ల కారణంగా భారతదేశ పేమెంట్ రెవెన్యూ విస్తరిస్తుంది, వీటిలో మూడింట రెండు వంతులు ఆన్‌లైన్‌లో ఉంటాయి.
ఫిన్‌టెక్ సంస్థలు టెక్నాలజీ, రెగ్యులేటరీ ఛేంజెస్ ద్వారా ఓపెన్ అయిన కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. బ్యాంకులు తమ ప్రధాన సామర్థ్యాలు, వ్యూహాత్మక ప్రాధాన్యతల ఆధారంగా వివిధ యూజ్ కేసెస్‌ను కొనసాగించేందుకు అవకాశం ఉంది.
ప్రారంభంలో బ్యాంకులు తమ సొంత యాప్‌లలోకి అడుగుపెడుతుందనే భయంతో, షేర్డ్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి వెనుకాడాయి. ఇప్పుడు ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద పేమెంట్ రెవెన్యూకి యాక్సెస్ పొందాయి. అంతేకాకుండా కార్డ్ ఫీజు, క్రెడిట్ లైన్లపై వడ్డీ ఆదాయం వంటి కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. ఉదాహరణకు పేటీఎం గత త్రైమాసికంలో మొదటి రెండు నెలల్లో తన ప్లాట్‌ఫారమ్‌లో రూ.16,500 కోట్ల రుణాలు డిస్ట్రిబ్యూట్ చేసింది, ఇందులో 137% వృద్ది నమోదైంది.
గత సంవత్సరం రెవెన్యూలో 38% వృద్ధికి కాంప్లిమెంటరీ సర్వీస్ తోడవుతూ లాభాల పంట పండుతోంది. ఇప్పటికే ఉన్న వ్యవహారాలకు అంతరాయం కలిగించకుండా ఉండటం భారత బ్యాంకులకు మంచి ఆలోచన. ఉచితంగా, వేగవంతమైన ట్రాన్సాక్షన్లు అందించే ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ నుంచి పొందాల్సింది ఇంకా చాలా ఉంది.
COMMENTS