Business in Crores through Dairy Farm.. This Milk Trader Business Adurs..!
డైరీఫామ్ ద్వారా కోట్లలో వ్యాపారం.. ఈ పాల వ్యాపారి బిజినెస్ అదుర్స్..!
ప్రస్తుతం పాడి రంగానికి కీలక స్థానం ఉంది. అయితే చాలా మంది రైతులు.. వ్యవసాయం చేసినంతగా పాడి రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. డైరీ, మేకలు, ఫౌల్ట్రీ, రొయ్యలు, చేపల పెంపకం అనుకున్నంతగా పెరగడం లేదు. ముఖ్యంగా డైరీ బిజినెస్ లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో అన్ని రెడీమేడ్ గా మారిపోయాయి. గతంలో గ్రామాల్లో ప్రతీ ఇంటికి గేదెలు, ఆవులు, కోళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. గ్రామాలకు కూడా పాకెట్ పాలు దర్శనం ఇస్తున్నాయి. దీంతో డైరీ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువత డైరీ బిజినెస్ పై ద్రుష్టి సారిస్తే చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది డైరీ బిజినెస్ లో సక్సెస్ అయ్యారు.
గుజరాత్ లోని మెహ్సానీ జిల్లాలో ఓ వ్యక్తి.. డైరీ ఫామ్ పెట్టి భారీ ఆదాయం పొందుతున్నాడు. మెహ్సానాలోని ఖేరాలుకు చెందిన పశుపోషకుడు దేశాయ్ అశోక్ భాయ్ జీవ్జీభాయ్ వందకు పైగా ఆవులను పెంచుతూ.. సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాడు. మొత్తం మెహ్సానా జిల్లాలో ఇతను ఐదో అతిపెద్ద పాల వ్యాపారి కావడం గమనార్హం.
దేశాయ్ అశోక్ భాయ్ జీవ్ జీభాయ్.. పదో తరగతి మాత్రమే చదివివాడు. అతని వయసు ప్రస్తుతం 54 సంవత్సరాలు. గత 28 ఏళ్లగా డైరా ఫామ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 28 ఏళ్ల క్రితం కేవలం ఒక్క ఆవుతో మొదలైన పశుసంవర్థక వ్యాపారం ఇప్పుడు కోట్ల రూపాయలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ పశువుల కాపరి వద్ద 120 పాడి పశువులు ఉన్నాయి. మొత్తం 120 పాడి పశువుల్లో 70 హెచ్ఎఫ్ ఆవులు, ఏడు గేదెలు, 40 గిర్ ఆవులు ఉన్నాయని, వాటి ద్వారా రోజుకు 600 లీటర్ల పాలు సేకరించి విక్రయిస్తునట్లు అశోక్ భాయ్ తెలిపాడు.
ఈ సందర్భంగా అశోక్ భాయ్ మాట్లాడుతూ.. తాను ఏటా రూ.5 లక్షల గడ్డిని పశువులకు మేతగా వేస్తానని తెలిపాడు. దీనితో పాటు తన పొలంలో కూడా పచ్చి గడ్డిని నాటానని పేర్కొన్నాడు. దీనితో పాటు పశువులకు డానా, అప్పడి, మొక్కజొన్న గడ్డి ఆహారంగా ఇస్తునట్లు వివరించాడు. ఇక పశువుల నుంచి సేకరించిన పాలను.. సహకార డెయిరీకి సరఫరా చేస్తునట్లు వివరించారు. దీని కారణంగా నెలకు దాదాపు 8 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏడాదికి సుమారు కోటి రూపాయల విలువైన పాలను విక్రయించారు.
అంతేకాకుండా గిర్ ఆవు పాలను రిటైల్ చేయడం ద్వారా రూ.12 నుంచి రూ.13 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. పశుపోషణ వ్యాపారంలో వారి వార్షిక ఖర్చులలో 45% వరకు సంపాదిస్తారు. అంటే వారి ఆదాయం ద్వారా రూ.65 లక్షల లాభం వస్తుంది. తబేలాలో పనిచేసే కార్మికులకు ఏడాదికి రూ.4 లక్షల వేతనం చెల్లిస్తునట్లు అశోక్ భాయ్ తెలిపారు.
COMMENTS