Blue Aadhaar Card: Do you have Bal Aadhaar card for children at home? Apply like this.
Blue Aadhaar Card: మీ ఇంట్లో పిల్లలకు బాల్ ఆధార్ కార్డు ఉందా? ఇలా అప్లై చేసుకోండి.. లేకుంటే తిప్పలే!
UIDAI: కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) చిన్న పిల్లలకు ప్రత్యేకంగా బ్లూ ఆధార్ కార్డులు జారీ చేస్తుందని మీకు తెలుసా? వీటినే బాల్ ఆధార్ కార్డులని పిలుస్తుంటారు. అసలు బ్లూ ఆధార్ కార్డు అంటే ఏంటి? దీని కోసం ఏయే డాక్యుమెంట్లు కావాలి.. ? ఎలా అప్లై చేసుకోవాలి తెలుసుకుందాం.
Apply for Blue Aadhaar Card: మన దేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ గుర్తింపు కార్డుగా తొలి ప్రాధాన్యం దీనికే ఉంటుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా.. పాన్ కార్డు కావాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరపాలన్నా ఆధార్ కార్డుకు విశేష ప్రాముఖ్యం ఉంటుంది. ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందాలన్నా కూడా.. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఇలా ఎక్కడ ఏ పని కోసమైనా ఆధార్ కార్డు అవసరం పడుతుంది. యూఐడీఏఐ (UIDAI) .. అప్లై చేసుకునే ప్రతి ఒక్కరికీ కూడా 12 అంకెల సంఖ్యతో పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, పర్మినెంట్ అడ్రస్ వంటి డీటెయిల్స్‌తో ఆధార్ కార్డు జారీ చేస్తుంది. అయితే ఆధార్ కార్డు తెలుపు రంగులో ఉండటమే మనం చూస్తాం. కానీ యూఐడీఏఐ ఇటీవల స్పెషల్‌గా బ్లూ కలర్ ఆధార్ కార్డుల్ని జారీ చేస్తోంది. అసలు ఈ బ్లూ ఆధార్ కార్డు ఏంటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా అప్లై చేసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం.
చిన్న పిల్లల కోసమే స్పెషల్‌గా బ్లూ ఆధార్ కార్డులు జారీ చేస్తుంటుంది. బాల్ ఆధార్ అన్నా కూడా ఇదే. ఐదేళ్లలోపు పిల్లల కోసం జారీ చేసే ఈ కార్డుల్లో ఆధార్ నంబర్ బ్లూ కలర్‌లో ఉంటుంది. అందుకే వీటిని బ్లూ ఆధార్ కార్డులుగా పరిగణిస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి ఫింగర్‌ప్రింట్స్, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించకుండానే ఈ కార్డు ఇస్తారు. పాప/బాబు పేరు, తల్లిదండ్రుల పేరు, అడ్రస్, ఒక ఫొటో వంటి ప్రాథమిక సమాచారం ఇస్తే సరిపోతుంది. వీరికి ఇచ్చే బ్లూ ఆధార్ కార్డును.. తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌తో లింక్ చేస్తారు. ఈ బ్లూ ఆధార్ కూడా 12 అంకెలు ఉంటుంది.
బ్లూ ఆధార్ ఎప్పుడు తీసుకున్నా కూడా.. దీని కాలపరిమితి చిన్నారులకు ఐదేళ్లు వచ్చే వరకే ఉంటుంది. తర్వాత వారి వేలిముద్రలు, ఇతర బయోమెట్రిక్ డీటెయిల్స్ అందజేసి ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ బ్లూ ఆధార్ కార్డు ఐదేళ్ల తర్వాత చెల్లుబాటు కాదు. 15 సంవత్సరాలు నిండిన తర్వాత మళ్లీ చిన్నారుల ఈ ఆధార్‌ను అప్‌డేట్ చేయాలి. తల్లిదండ్రులు.. తమ పిల్లల కోసం ఈ బాల్ ఆధార్ అప్లై చేసుకోవాలి.
బ్లూ ఆధార్‌కు అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..
పిల్లల బర్త్ సర్టిఫికెట్ లేదా చిన్నారుల పాఠశాల ఐడెంటిటీ కార్డు
తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్
పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డు.. తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలంటే?
- తొలుత UIDAI అఫీషియల్ వెబ్‌సైట్ UIDAI.Gov.in కు వెళ్లాలి.
- తర్వాత ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో పిల్లల పేరు, పేరెంట్స్ లేదా గార్డియన్ ఫోన్ నంబర్, పిల్లలు, సంరక్షకులు లేదా తల్లిదండ్రులకు సంబంధించిన ఇతర బయోమెట్రిక్ డేటా సహా అవసరమైన సమాచారం తల్లిదండ్రులు అందించాల్సి ఉంటుంది.
- తర్వాత మీ ఇంటి అడ్రస్, రాష్ట్రం, కమ్యూనిటీ వంటి డెమొగ్రాఫిక్ సమాచారం నమోదు చేయాలి.
- అడిగిన పూర్తి సమాచారం అందించాలి.
- తర్వాత ఆధార్ రిజిస్టర్ చేసుకోవడానికి.. అపాయింట్‌మెంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- దగ్గర్లోని ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లో అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.
- అక్కడికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు, అడ్రస్, పుట్టిన తేదీ.. రిఫరెన్స్ నంబర్ సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి.
- ఈ ప్రాసెస్ పూర్తయితే తర్వాత ఆధార్ నమోదు కేంద్రం వారు.. ఒక రసీదు సంఖ్య మీకు అందిస్తారు. మీరు అప్లై చేసుకున్న బ్లూ ఆధార్ స్టేటస్‌ను ఈ నంబర్‌తో తెలుసుకోవచ్చు.
COMMENTS