Reynolds Pen: The childhood 'friend' is no longer celebrated.. Reynolds pen company is closed!
Reynolds Pen: చిన్ననాటి ‘ఫ్రెండ్’కు ఇక సెలవ్.. రెనాల్డ్స్ పెన్నుల కంపెనీ మూత!
Reynolds Pen: మన దేశంలో చాలా మంది ఎంతో ఇష్టంగా వినియోగించిన రెనాల్డ్స్ పెన్నులు ఇక కనిపించవు. ఎందుకంటే రెనాల్డ్స్ కంపెనీ మూసివేస్తున్నారటా. ప్రస్తుతం అమెజాన్‌లో చివరి స్టాక్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే బుక్ చేసుకుని మీ జ్ఞాపకాలను పదిలం చేసుకోండి. ఇంతకీ ఆ కంపెనీ ఎందుకు మూసి వేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Reynolds Pen: రెనాల్డ్స్ పెన్.. ఈ పేరు వినగానే చాలా మందికి వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చే ఉంటాయి. తాము చదువుకునే రోజుల్లో వాడిన రెనాల్డ్స్ పెన్ గురించి ఒక్కసారి మదిలో మెదిలే ఉంటుంది. అయితే, మీ చిన్నప్పటి ఈ సోపతి ఇక కనిపించదు. ఎందుకంటే రెనాల్డ్స్ పెన్నుల కంపెనీ మూసివేస్తున్నారటా. ఇప్పటికే చాలా వరకు రెనాల్డ్స్ కంపెనీకి చెందిన పెన్నులు మార్కెట్లో కనిపించకపోవడాన్ని మీరు గమనించే ఉంటారు. ఈ కంపెనీకి చెందిన చివరి స్టాక్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే ఓ పెన్ కొనుక్కుని దాచుకోండి. మీ చిన్ననాటి జ్ఞాపకాలను పదిలం చేసుకోండి. అయితే, రెనాల్డ్స్ కంపెనీ మూసివేతకు గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా, ఫోర్డ్ వంటి బ్రాండ్లకు ఎంతో ఆదరణ ఉంది. అలాంటి వాటిలో ఒకటైన రెనాల్డ్స్ కంపెనీ మన దేశ విద్యా, ఉద్యోగ రంగంలో తనదైన ముద్ర వేసింది. 90లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ పెన్ ఎంతో సుపరిచితమనే చెప్పాలి. అప్పుడు 5 రూపాయలు విలువైన ఈ పెన్ పాకెట్‌లో ఉందంటే ఆ లెవెలే వేరుగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ బ్రాండ్ కనుమరుగైపోయింది. భారత్‌లో ఇంతగా ఆదరణ పొందిన ఈ రెనాల్డ్స్ కంపెనీ నిజానికి అమెరికాలో మొదలైందని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోక మానరు. ఈ పెన్నులపై ఉండే 045 అనేది 1945ని సూచిస్తుంది. అంటే రెనాల్డ్స్ 1945లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఇండియాలోకి ప్రవేశించింది. దశాబ్దాల పాటు భారతీయ విద్యా, ఉద్యోగాల రంగంలో తనదైన ముద్ర వేసింది. తమలో ఒకటిగా కలిసిపోయింది.
అప్పట్లో రెనాల్డ్స్‌ను ఢీకొట్టేందుకు మార్కెట్లోకి వచ్చే పెన్నులు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయనే చెప్పాలి. ఎందుకంటే అవి తరుచుగా లీక్ అవుతూ పాకెట్‌ను బ్లూగా మార్చేసిన సంగతి మీకూ తెలిసే ఉంటుంది. అందులో ఖరీదైన పార్కర్, పైలోడ్, మిట్సుబిషి వంటివి సైతం ఉండడం గమనార్హం. భారతీయ విద్యా వ్యవస్థ ఒక ప్రత్యేకమైన రాత పద్ధతులు కలిగి ఉండేది. అందుకు ఇలాంటి ఖరీదైన బ్రాండ్లు ఆ అవసరాలను తీర్చలేకపోయాయనే చెప్పాలి. క్లాస్ నోట్స్, హోమ్ వర్క్, అసైన్‌మెంట్స్, పరీక్షలు వంటివి ఎన్నో రకాలుగా రోజూ రాస్తూనే ఉండాల్సి వచ్చేది. వాటన్నింటికీ ఒకటే పరిష్కారంగా కనిపించేది రెనాల్డ్స్ పెన్.
సచిన్ టెండుల్కర్ పెన్..
రెనాల్డ్స్ పెన్ అనగా ముందుగా గుర్తొచ్చేంది 045 ఫైన్ కార్బర్- సచిన్ టెండుల్కర్ పెన్. ఆ పెన్ రీఫిల్ ఎప్పుడూ లీక్ కాకపోయేది. ఇంక్ ఎప్పుడూ స్పష్టంగా ఉండేది. ఈ పెన్ను చాలా తేలికగా ఉండడం వల్ల రబ్బర్ బ్యాండ్ రాకెట్ ప్రొపెళ్లర్‌గా వినియోగించే వారు పిల్లలు. అలాగే క్యాప్ ఫైట్ చేసుకునేవారు. అందులో మీరు కూడా ఉండే ఉంటారు. ఈ పెన్నుల్లో పర్పుల్, గ్రీన్, బ్రౌన్ కలర్ వర్షన్స్ సైతం ఉండేవి. అలాగే జెట్టర్ పెన్ ఎక్కువగా టీచర్లు ఉపయోగించేవారు. అంతే కాదు ట్రైమాక్స్ పెన్ అనేది ఎక్కువగా పరీక్షల సమయంలో ఉపయోగించేవారు. దీంతో రాస్తే చాలా వేగంగా పరీక్ష పూర్తి చేయొచ్చు అనే నమ్మకం పిల్లల్లో ఉండేది. అయితే, ఇప్పుడు ఆ పెన్నులు కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్ మయం అయిపోయింది. డాక్యుమెంట్స్, పీడీఎఫ్‌ల రూపంలోనే డేటా సేకరిస్తున్నారు. రాయడం తగ్గిపోయింది. ప్రస్తుతం దుకాణాల్లో రెనాల్డ్స్ పెన్నులు కనిపించడం లేదు. చాలా మంది దుకాణదారులు చెబుతున్నది అదే. ఇకపై మార్కెట్లో రెనాల్డ్స్ పెన్నులు కనిపించవని చెబుతున్నారు.
చివరి బ్యాచ్ అమెజాన్‌లో..
ప్రస్తుతం ఉన్న రెనాల్డ్స్ పెన్నుల చివరి బ్యాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుత పిల్లలకు రెనాల్డ్స్ అంటే నటుడు ర్యాన్ గుర్తుకొస్తారేమో. కానీ, 90లో పుట్టిన వారికి రెనాల్డ్స్ అంటే చిన్ననాటి జ్ఞాపకం. రెనాల్డ్స్ పెన్నుతో అనుబంధం కలిగి ఉన్న వారు అమెజాన్‌లో వెంటనే ఓ పెన్ కొనుక్కోండి. కొద్ది రోజులైతే అవి కూడా దొరకకపోవచ్చు.
COMMENTS