HMDA Plots: Auction of HMDA plots in Hyderabad.. per yard Rs. 25 thousand only.. Waiting for that day!
HMDA Plots: హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం.. గజం రూ. 25 వేలకే.. ఆరోజు కోసం ఎదురుచూపులు!
HMDA Plots: ఇటీవల హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మహానగర పరిధిలో పెద్ద ఎత్తున భూముల్ని వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కోకాపేట నియోపొలిస్ లేఅవుట్‌లో ప్లాట్ల వేలం జరగ్గా.. రెండో విడత కోసం అలాగే.. రంగారెడ్డి జిల్లా మోకిలలోనూ ప్లాట్ల వేలానికి సిద్ధమైంది. అయితే ఇక్కడ ప్లాట్ గజం ధర ఎంతో తెలుసుకుందాం.
HMDA Plots Auction: హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఇదే క్రమంలో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటోంది. భూముల ధరలు పెరుగుతున్నాయి. రెంట్లు పెరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ కూడా కొద్దిరోజుల కింద పఠాన్ చెరులో భూముల ధరలపై చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో మహానగర పరిధిలో ప్లాట్లను పెద్ద ఎత్తున విక్రయిస్తోంది హెచ్‌ఎండీఏ (HMDA). సరికొత్తగా ల్యాండ్ పూలింగ్ చేపట్టి ప్లాట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా గండిపేట- శంకర్‌పల్లి మార్గంలోని మోకిలలో HMDA ప్లాట్ల వేలం నిర్వహించేందుకు సిద్ధమైంది.
మొత్తం 325-433 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్స్ ఉన్నాయి. మోకిల రెవెన్యూ గ్రామ పరిధిలో HMDA వెంటర్ ప్లాట్ల స్థలంలో తాజాగా ప్రీబిడ్డింగ్ నిర్వహించింది. దీనికి 200 మందికిపైగా హాజరయ్యారు. ఇక్కడ సుమారు 165.37 ఎకరాల విస్తీర్ణంలో 1321 ప్లాట్ల డిజైన్‌తో హెచ్‌ఎండీఏ లేఅవుట్ రూపొందించింది. వీటిల్లో ఇప్పుడు తొలి దశలో భాగంగా 50 ప్లాట్లను ఆన్‌లైన్‌లో వేలం వేసేందుకు సిద్ధమైంది.
ఇక ఈ మోకిలలో ప్లాట్ల ప్రారంభ ధర గజం రూ. 25 వేలుగా నిర్ణయించింది HMDA. ఆసక్తి ఉన్న కొనుగోలు దారులు ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకోవచ్చు. మోకిల హెచ్‌ఎండీఏ లేఅవుట్ పక్కనే శంకరపల్లి 100 ఫీట్ రోడ్ ఉండటం, 20 నిమిషాల్లోనే కోకాపేట్ నియో పొలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట్ పార్క్, CBIT వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉండటంతో ఇక్కడ ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయని అధికారులు భావిస్తున్నార. విల్లా, గ్రూప్ హౌసింగ్ కట్టుకోవాలనుకుంటున్నవారికి ఈ ప్లాట్లు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇక అసలైన వేలం ఆగస్టు 7న జరగనుంది.
కోకాపేట నియో పొలిస్ మొదటి విడతలో వేలం వేసిన 65 ఎకరాలతో రూ. 2 వేల కోట్లకుపైనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. గరిష్టంగా ఎకరాకు అప్పుడు రూ. 60 కోట్లు పలికింది. ఫేజ్‌లో ఈసారి 45.33 ఎకరాలను ఇ- వేలం వేయాలని నిర్ణయించింది HMDA.
COMMENTS