Cash Limit: How much money can be kept at home.. how much can be deposited in the bank account!
Cash Limit: ఇంట్లో ఎన్ని డబ్బులు ఉంచుకోవచ్చు.. బ్యాంక్ అకౌంట్‌లో ఎంత వరకు డిపాజిట్ చేయొచ్చు!
Cash Store in House: ఇప్పుడంతా లావాదేవీలు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అయితే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పటికీ.. చాలా మంది ఇప్పటికీ ఇళ్లలోనే డబ్బులు దాచుకుంటున్నారు. ఇంట్లో ఎన్ని డబ్బులైనా దాచుకోవచ్చా? దీనికేమైనా లిమిట్ ఉంటుందా? ఇంకా బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు విత్‌డ్రా, డిపాజిట్‌పై ఏమైనా లిమిట్ ఉందా?
Cash Limit Home: టెక్నాలజీ అంతకంతకూ పెరిగిపోతోంది. వివిధ అప్లికేషన్ల ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్లు కూడా సులువుగా చేసుకునే వెసులుబాటు వచ్చింది. బ్యాంకులకు వెళ్లకుండానే.. వీటి ద్వారా 24 గంటల్లో ఎప్పుడైనా లక్షల్లో లావాదేవీలు చేసుకోవచ్చని తెలిసిందే. సెకన్ల వ్యవధిలోనే ఇతరులకు డబ్బులు బదిలీ చేయొచ్చు.. డబ్బులు స్వీకరించవచ్చు. దీంతో ఇండియాలో ఇలాంటి నగదు లావాదేవీలు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి.
అయితే సాంకేతికత ఇంత పెరిగినా కూడా ఇంకొందరు పాత పద్ధతుల్ని పాటిస్తున్నారు. తమ డబ్బుల్ని ఇంట్లోనే దాచిపెట్టుకుంటున్నారు. ఇలా ఇంట్లో డబ్బులు దాచిపెట్టుకుంటే.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. అసలింట్లో డబ్బులు ఎంతవరకు దాచుకోవచ్చు.. ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఏ పత్రాలు అవసరం అవుతాయి.. చూద్దాం.
ఇంట్లో ఎంత డబ్బులు నిల్వ చేసుకోవచ్చు అనేదానిపై ఎలాంటి లిమిట్స్ లేవు. ఆదాయపు పన్ను శాఖ కూడా దీనిపై అలాంటి నిబంధనలేం పెట్టలేదు. ఇంట్లో ఎంతైనా డబ్బు ఉంచుకోవచ్చు. అయితే ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తే.. ఆ డబ్బులు ఎక్కడివి.. ఎలా వచ్చాయనేది చెప్పాలి. దానికి ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్స్ చూపించకపోతే ఫైన్..
ఇంట్లో ఉన్న డబ్బు ఎలా వచ్చిందో సరైన డాక్యుమెంట్లు చూపించకపోతే.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. మీ మొత్తం డబ్బులో సుమారు 137 శాతం వరకు ఫైన్ పడుతుంది. అయితే అలాగే పత్రాలు చూపించని డబ్బును స్వాధీనం కూడా చేసుకోవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో డాక్యుమెంట్స్ లేని or లెక్కల్లో లేని రూ. 20 లక్షలకు మించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే జరిమానా విధిస్తారు. ఇంకా ఏ వ్యక్తి అయినా లోన్ లేదా డిపాజిట్ కోసం రూ. 20 వేలకు మించి నగదు స్వీకిరంచేందుకు అనుమతి లేదు.
రూ. 20 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే..?
ఇక ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల రూపాయలకు మించి నగదు డిపాజిట్ చేస్తే మాత్రం పాన్, ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. రూ. 50 వేల నగదుకు మించి డిపాజిట్ చేసినా/విత్‌డ్రా చేసినా పాన్ కార్డు సమర్పించాలి. ఆస్తి అమ్మకం/ కొనుగోలు చేయడం ద్వారా రూ. 30 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే దర్యాప్తు సంస్థలు విచారించొచ్చు. ఇంకా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి ఒకేసారి రూ. లక్ష విత్‌డ్రా చేసినా విచారణ ఎదుర్కోవచ్చు.
COMMENTS