Schools Fee: Bank Goodnews.. For children's school fees Rs. 9 lakh loan.. hurry up!
Schools Fee: బ్యాంక్ గుడ్‌న్యూస్.. పిల్లల స్కూల్ ఫీజు కోసం రూ. 9 లక్షల లోన్.. త్వరపడండి!
School Fees Financing: మీ పిల్లల్ని మంచి స్కూల్‌లో చదివించాలని చూస్తున్నారా? చేతిలో డబ్బుల్లేవు ఎలా అనుకుంటున్నారా? ఇబ్బంది పడాల్సిన పని లేదు. దీనికి కూడా బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. ఇది చాలా సులభం కూడా. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
School Fees Financing: ఈ రోజుల్లో చదువు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పిల్లల్ని స్కూల్‌కు పంపించాలంటేనే కొందరు భయపడే పరిస్థితి ఉంది. LKG, UKG లకే 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇంకొన్ని స్కూల్స్‌లో ఇంకా ఫీజు ఎక్కువే ఉండొచ్చు. అంటే ఇప్పుడు చదువు కొనాల్సిందేనన్నమాట. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే తల్లిదండ్రులకు ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ఈ బ్యాంక్ స్కూల్ ఫీజు ఫైనాన్స్ సర్వీసులు కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇక తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా లోన్ తీస్కొని పిల్లల్ని చదివించుకోవచ్చు. ఈ స్కూల్ ఫీజు ఫైనాన్స్ స్కీం కింద రూ. 9 లక్షల వరకు లోన్ పొందొచ్చని ఈ బ్యాంక్ పేర్కొంది. మొత్తం డిజిటల్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా మీరు ఈ లోన్ పొందేందుకు ఛాన్స్ ఉంది. ఈజీ రీపేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. లో కాస్ట్ EMI పెట్టుకోవచ్చు.
ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా టెన్యూర్ రెండేళ్ల వరకు పెట్టుకోవచ్చు. లోన్ వెంటనే పొందొచ్చు. భారత పౌరులెవరైనా లోన్ పొందొచ్చు. స్కూల్ నుంచి అడ్మిషన్ పొంది ఉండాలి. పిల్లల తల్లిదండ్రులు, లీగల్ గార్డియన్‌కు లోన్ వస్తుంది. అప్లికేషన్ ఫొటో ఐడీ, రెసిడెన్స్ ప్రూఫ్, అడ్మిషన్ డాక్యుమెంట్స్, ఫీజ్ స్ట్రక్చర్ డాక్యుమెంట్, బ్యాంకు స్టేట్‌మెంట్లు వంటివి అవసరం అవుతాయి. ఇంట్లో ఒకరి కన్నా ఎక్కువ మంది పిల్లల చదువుకు కూడా రుణం తీసుకోవచ్చు.
ఈ ఫైనాన్స్ ఆప్షన్ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకున్న స్కూల్‌లో చదివే పిల్లలకు మాత్రమే అమల్లో ఉంది. మీరు లోన్ అప్లై చేసుకునే ముందు ఈ విషయం చెక్ చేసుకోవాలి. మీ దగ్గర్లోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుకు వెళ్లి.. ఈ లోన్ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అర్హతలు ఉండి.. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే వెంటనే సులభంగా లోన్ పొందొచ్చు. ఇంకా ఈ బ్యాంక్ సులభంగానే ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఆఫర్ చేస్తుందన్న విషయం తెలుసుకోండి. 9 శాతం వడ్డీ రేటు ప్రారంభం నుంచి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు లోన్ పొందొచ్చు.
COMMENTS