Rythu Bandhu 2023: Another Key Update on 'Rythu Bandhu' - Chance to Change Bank Account - Do It
Rythu Bandhu 2023: ‘రైతుబంధు’పై మరో కీలక అప్డేట్ - బ్యాంక్ అకౌంట్ మార్చుకునే ఛాన్స్ - ఇలా చేయండి.
Rythu Bandhu scheme 2023: వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను జూన్ 26 నుంచి విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులకు ఎప్పటిలాగే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావును, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇదిలా ఉంటే... బ్యాంక్ ఖాతాల మార్చుకోవటం లేదా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కీలక అప్డేట్ ఇచ్చింది వ్యవసాయశాఖ. ఇందుకు సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది.
-వానాకాలం -2023 రైతు బంధు గూర్చి ఎవరైనా లోన్ అకౌంట్ లేదా ఇతర కారణాలు కలిగి అకౌంట్ మార్చుకోవడానికి జూన్ 21 సాయంత్రం వరకు అవకాశం కలదు.
- అకౌంట్ మార్చుకునే రైతులు తమ కొత్త అకౌంట్ పాస్ బుక్ జీరాక్స్ లను స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
-రైతుబంధు కొత్త రైతుల దరఖాస్తు - చివరి తేదీల వివరాలను వ్యవసాయశాఖ నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తేలియజేయనున్నారు.
- జూన్ 26 వ తారీఖు నుండి గతంలో రైతు బంధు అందుకున్న రైతులకు రైతు బంధు నిధులు జమ కావడం ప్రారంభం అవుతాయి.
- కొత్త రైతులకు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ వివరాలు నమోదు చేసిన తదుపరి చివరిలో జమ అవుతాయి.
రైతు బంధు పథకం కింద ప్రతీ ఎకరానికి వానాకాలం, యాసంగి సీజన్లో రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సీజన్‌లో కూడా ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనుంది సర్కార్. వారికి కూడా ఇదే ఏడాది నుంచే రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పోడు భూముల పట్టాలు పొందే ప్రతి లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించనుంది. సంబంధిత రైతు బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, లబ్ధిదారుడి మొబైల్ నంబర్ తదితర వివరాలను అప్‌లోడ్ చే సేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది పోడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచేపనిలో పడ్డారు.
COMMENTS