How to activate 'Silence Unknown Callers' feature to silence unknown numbers and scam calls on WhatsApp
వాట్సాప్ లో తెలియని నెంబర్లు మరియు స్కామ్ కాల్స్ ను సైలెన్స్ చేసేలా 'సైలెన్స్ అన్ నోన్ కాలర్స్' ఫీచర్ - యాక్టివేట్ చేయు విధానం ఇదే.
వాట్సాప్ లో స్పామ్ కాల్స్ గురించి చాలా మంది నుంచి ఫిర్యాదులు ఇస్తున్నారని సంగతి తెలిసిందే. ముఖ్యంగా అంతర్జాతీయ నెంబర్లతో వస్తున్న కాల్స్ వస్తున్నాయి. దీంతో వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా యూజర్లందరికీ దీన్ని మంగళవారం (జూన్ 20) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
తెలియని నెంబర్లు, స్పామ్, స్కామ్ కాల్స్ ను సైలెన్స్ చేసేలా 'సైలెన్స్ అన్ నోన్ కాలర్స్ ఫీచర్ ను ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఈ తరహా కాల్స్ వచ్చినప్పుడు మీ ఫోన్లో ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అంటే రింగ్ రావడం కానీ, స్క్రీన్ పై కాల్ వస్తున్నట్లుగా కానీ కనిపించదని తెలిపింది. అయితే, కాల్ లిస్ట్ లోకి వెళితే మాత్రం కాల్ వచ్చిన నెంబర్లన్నీ కనిపిస్తాయని పేర్కొంది. ఫలితంగా ఒకవేళ ఏవైనా ముఖ్యమైన కాల్స్ ఉంటే చూసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించింది.
ఎలా యాక్టివేట్ చేయాలి?
1. వాట్సాప్ ను ఓపెన్ చేయాలి.
2. కుడివైపు పై భాగంలో ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
3. ప్రైవసీలోకి వెళ్లగానే పైన 'ప్రైవసీ చెకప్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
4. 'స్టార్ట్ చెకప్' పై క్లిక్ చేయాలి.
5. 'చూజ్ హూ కెన్ కాంటాక్ట్ యూ'ను ఎంపిక చేసుకోవాలి.
6. కనిపించే మెనూలో 'సైలెన్స్ అన్నోన్ కాలర్స్ 'పై క్లిక్ చేయాలి.
7. తర్వాత 'సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఆప్షన్'ను ఆన్ చేయాలి.
ఇక మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేని ఏ నంబర్ నుంచి కాల్స్ వచ్చినా.. అవి మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యవు.
COMMENTS