Part time Jobs: You can earn money even while studying.. These are the best part time jobs..!
Part time Jobs: చదువుకుంటూ కూడా డబ్బులు సంపాదించవచ్చు.. బెస్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ ఇవే..!
పార్ట్ టైమ్ జాబ్స్ కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. చాలా మంది చదువుకుంటూనే మనీ ఎర్న్ చేస్తున్నారు. కొంతమంది ఎలా చేయాలో తెలియక గూగుల్ లో పార్ట్ టైమ్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు.
అటు ఇప్పటికే జాబ్ చేస్తూ ఉన్నవాళ్లు కూడా సైడ్ ఇన్ కమ్ ఉంటే బెటర్ అని ఆలోచిస్తుంటారు. శాలరీ తక్కువ ఉన్నవాళ్లకి ఈ ఆలోచన ఉంటుంది. కంపెనీ రూల్స్ బ్రేక్ చేయకుండా కొన్ని పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకునే అవకాశముంటుంది. ఇలా అందరికి పార్ట్ టైమ్ జాబ్స్ చాలా యూజ్ అవుతాయి. ఇంతకి మార్కెట్లో బెస్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ ఏంటి..?
కాపీ రైటర్: తమ పనులను ఔట్‌లుక్ చేయడానికి ఫ్రీలాన్స్ కాపీ రైటర్‌లను నియమించుకోవడానికి చాలా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి . మీరు వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజీ కంటెంట్‌ను రూపొందించాలనుకున్నా, కంపెనీల కోసం బ్లాగ్‌లు రాయాలనుకున్నా ఇది బెస్ట్ ఆప్షన్.. పార్ట్ టైమ్ కాపీరైటర్ నెలవారీ 5-10kతో ప్రారంభమవుతుంది. అనుభవం, మెరుగైన క్లయింట్‌లతో, నెలకు 50-70k వరకు సంపాదించవచ్చు.
గ్రాఫిక్ డిజైనర్: మీకు డిజైనింగ్, ఇలస్ట్రేషన్స్ పట్ల ఆసక్తి ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. మీ క్రియేటివిటీనే మీ ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. పార్ట్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్లకు10వేల నుంచి లక్ష రూపాయల వరు సంపాదించుకునే అవకాశముంటుంది.
డేటా ఎంట్రీ: మీ టైపింగ్ వేగం ఎక్కువగా ఉంటే, ఈ డేటా ఎంట్రీ జాబ్ ఎంపిక ఉత్తమమైనది. ఈ రకమైన పనిని ఆన్‌సైట్ లేదా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. జీతం 5వేల-20వేల మధ్య ఉంటుంది. అయితే ఇలాంటి జాబ్స్ లో జాయిన్ అయ్యే ముందు కంపెనీ గురించి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. చాలా వరకు ఫ్రాడ్ కంపెనీలు ఉండే అవకాశముంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బులు కట్టదు.
ఫుడ్ డెలివరీ: ప్రస్తుతం స్విగ్గి, జొమాటో డెలవరీ బాయ్స్ సీటిల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. దేశంలో డెలివరీ బాయ్‌కి సగటు జీతం రూ. 15,228.
వీడియో ఎడిటర్: వీడియోను ఎడిట్ చేయడం మీకు వస్తే చాలు.. మీరు వేరే కోర్సు లేదా.. ఇతర జాబ్స్ చేసుకుంటూ కూడా సైడ్ ఇన్ కమ్ సెట్ చేసుకోవచ్చు. నెలవారీ 15వేల నుంచి 20వేల వరకు సంపాదించుకోవచ్చు.
పార్ట్ టైమ్ ఫోటోగ్రఫీ: విభిన్న కోణాల నుంచి చిత్రాలను తీయాలని ఇష్టపడితే, ఈ ఉద్యోగం మీకు బాగా సరిపోతుంది. ఈ రోజుల్లో ఫోటోగ్రఫీ లాభాలను ఆర్జించే జాబ్.. ఇది పార్ట్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు. దేశంలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌లు ఒక వివాహ ఫంక్షన్ కోసం 2-3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
కస్టమర్ సర్వీస్: పార్ట్ టైమ్ జాబ్ చేయాలని భావించే వాళ్లకు కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కొన్ని కంపెనీలు ఇంటినుంచే ఈ ఉద్యోగాలను చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా మరికొన్ని కంపెనీలు మాత్రం ఆఫీస్ కు వచ్చి విధులు నిర్వహించాలని నిబంధనలను విధిస్తున్నాయి. నియమిత సమయాన్ని ఎంచుకుని సులభంగా ఈ ఉద్యోగాలు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
COMMENTS