WhatsApp New Feature: A feature that comes from WhatsApp.. Two accounts in the same app.. That's it..
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఒకే యాప్‌లో రెండు అకౌంట్.. అదెలాగంటే..
ప్రపంచం వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ప్రధానమైనది. అమెరికన్ టెక్ కంపెనీ మెటా యాజమాన్యంలోని ఈ వాట్సాప్.. తన వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. తద్వారా వినియోగదారులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో నిమిగ్నమై ఉంది. ఇప్పటికీ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం రీడిజైన్ చేయబడిన ఎమోజీ కీబోర్డును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైన వాట్సాప్.. ఇప్పుడు అంతకు మించిన అమేజింగ్ ఫీచర్‌ను తీసుకువస్తోంది.
వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఒకే యాప్‌లో రెండు వేర్వేరు వాట్సాప్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అవాకశం కల్పిస్తోంది. అంటే.. ఒక స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్‌లు ఉంటే.. ఈ రెండు సిమ్‌ల కోసం ఒకే మొబైల్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్ ఓపెన్ చేసే వీలు ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ వెర్షన్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ వెర్షన్‌కు కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుందని టాక్ వినిపిస్తోంది.
ఎమోజీ కీబోర్డ్..
ఆండ్రాయిడ్‌లోని కొన్ని బీటా టెస్టర్‌లకు వాట్సాప్ రీడిజైన్ చేసిన ఎమోజి కీబోర్డ్ అందుబాటులోకి వచ్చింది. WABetaInfo ప్రకారం.. ఈ రీడిజైన్ చేయబడిన ఎమోజి కీబోర్డ్‌పై స్క్రోల్ చేయడం సహా మల్టీపుల్ ఆప్షన్స్ అందిస్తోంది. GIF, స్టిక్కర్, అవతార్‌లు అందుబాటులో ఉన్నాయి. రీడిజైన్ చేసిన కీబోర్డ్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. కొన్ని వారాల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని సమాచారం.
క్రాప్ ఆప్షన్..
వాట్సాప్ కొత్త క్రాప్ టూల్ ఆప్షన్‌ను తీసుకువచ్చింది. వాట్సాప్ విండోస్ బీటాలో డ్రాయింగ్ ఎడిటర్ కోసం కొత్త క్రాప్ టూల్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫోటోలను సెట్ చేసుకోవడం, కట్ చేసుకోవడం వంటివి చేయొచ్చు. గతంలో వినియోగదారులు తమ ఫోటోలను షేర్ చేయడానికి ముందు వాటిని క్రాప్ చేయడానికి ఎడిటింగ్ ఆప్షన్ ఉండేది. కానీ, ఈ కొత్త ఫీచర్.. యాప్‌లోనే నేరుగా ఫోటోలను క్రాప్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
COMMENTS