whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. అచ్చం గూగుల్ మీట్‌స్క్రీన్‌లాగే షేరింగ్ ఆప్షన్.
ఆధునిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఇంత ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కుటి క్రేజ్ ఏర్పడింది. ఇంతటీ కాంపిటేషన్‌లోనూ వాట్సాప్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే మెసేజ్ ఎడిట్, చాట్ లాక్ వంటి వినూత్న ఫీచర్‌లను తీసుకొచ్చిన వాట్‌సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది. వీడియో కాలింగ్ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. సాధారణంగా జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లలో ఈ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంది.
ఆఫీస్ మీటింగ్, కానీ మరే ఇతర సమావేశాల్లోనైనా ఒక యూజర్ ఈ ఆప్షన్ ద్వారా తన స్క్రీన్‌ను గ్రూప్‌లో ఉన్న వారందరికీ షేర్ చేసే అవకాశం ఉంటుంది. అచ్చంగా ఇలాంటి ఫీచర్‌నే వాట్సాప్ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ని కొందరు బీటా టెస్టర్‌లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో మన మొబైల్ స్క్రీన్‌ను అవతలి వ్యక్తికి షేర్ చేసే అవకాశం లభించనుంది.
స్క్రీన్ అడుగు భాగంలో కొత్తగా స్క్రీన్ షేరింగ్ బటన్‌ను వాట్సాప్ చేయనుంది. ఈ బటన్‌ను క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో చేసిన ప్రతిదీ రికార్డు అవ్వడంతో పాటు అవతలి వ్యక్తికి షేర్ అవుతుంది. దీనికి యూజర్ అనుమతి తప్పనిసరి. ఇదిలా ఉంటే గ్రూప్ వీడియో కాల్‌లో ఎక్కువ మంది వినియోగదారులు ఉంటే స్క్రీన్ షేర్ ఆప్షన్ పనిచేయకపోవచ్చని తెలుస్తోంది. అలాగే పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఉన్న ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రాకపోవచ్చని సమాచారం.
COMMENTS