MSTC Recruitment: Are you good at this software? A chance to get a job in a central government organization
MSTC Recruitment: మీకు ఈ సాఫ్ట్‌వేర్‌లో పట్టుందా.? కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కొట్టేసే ఛాన్స్
ఎంఎస్‌టీసీ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కోల్‌కతాలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. సిస్టమ్ నెట్‌వర్కింగ్, ఎఫ్ అండ్ ఏ, ఓపీఎస్, హిందీ, లా తదితర విభాగాలలో జావా ప్రోగ్రామర్, నెట్‌వర్కింగ్, డాట్ నెట్, ఆపరేషన్స్ తదితర మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* సిస్టమ్ నెట్‌వర్కింగ్, ఎఫ్ అండ్ ఏ, ఓపీఎస్, హిందీ, లా పోస్టులను భర్తీ చేయనున్నారు. జావా ప్రోగ్రామర్, నెట్‌వర్కింగ్, డాట్ నెట్, ఆపరేషన్స్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు జూన్ 11వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
FOR APPLY CLICKHERE
COMMENTS