KVS Recruitment: Jobs in Uppal Kendriya Vidyalaya, Interview without written test.. Full details..
KVs Recruitment: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ.. పూర్తి వివరాలివే..
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. హైదరాబాద్ ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయం పలు పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ పోస్టులను అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కేంద్రియ విద్యాలయం తన నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఈ క్రమంలోనే ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా అభ్యర్థులకు మార్చి 07 నుంచి 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
1) పీజీటీ
2) టీజీటీ
3) పీఆర్‌టీ
4) కోచ్
5) స్టాఫ్ నర్స్
6) ఎడ్యుకేషనల్ కౌన్సెలర్
7) స్పెషల్ ఎడ్యుకేటర్ & కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్.
విభాగాలు: కెమిస్ట్రీ, మ్యాథ్స్, హిందీ, కామర్స్, సోషనల్ స్డడీస్, ఇంగ్లీష్, సైన్స్, సంస్కృతం, మ్యూజిక్, డ్యాన్స్, హాకీ/అథ్లెటిక్స్, యోగా, టైక్వాండో.
అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించాలి.
వయోపరిమితి: 18-65 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.21250-రూ.27500 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya.No.1, Uppal, Hyderabad.
ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూ తేది: 07.03.2023 & 10.03.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30.
COMMENTS