HOME LOAN TYPES 2023

 HOME LOAN TYPES 2023

HOME LOAN TYPES 2023

వివిధ రకాల హోమ్ లోన్స్ మీకు తెలుసా? 7 రకాలు తెలుసుకోండి

శాలరైడ్, నాన్-శాలరైడ్, వ్యాపారులు.. ఇలా వివిధ రంగాల్లోని వారికి దేశంలో వివిధ బ్యాంకులు హోమ్‌లోన్‌ను అందిస్తాయి. హోమ్‌లోన్ తీసుకునే వారు ఎప్పటికప్పుడు పెరుగుతున్నారు. తమ చేతిలో ఇల్లు కొనేంత మొత్తం లేకుండా... సొంతింటి కల లక్ష్యం ఉన్నవారు హోమ్ లోన్ తీసుకుంటారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరికీ ఇల్లు(house for all) అనే కార్యాచరణతో ముందుకు వచ్చింది. దీంతో హోమ్ లోన్స్ కూడా పెరుగుతున్నాయి. సాధారణ హోమ్ లోన్స్ కంటే ఇల్లు కొనుగోళ్లు పెరిగాయి. వివిధ రకాల హోమ్ లోన్స్ ఉన్నాయి. దేశంలో అతి తక్కువ వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్న ఏడు విభిన్న హోమ్ లోన్స్ తెలుసుకోండి.

హౌసింగ్ పర్చేజ్ లోన్

భారత దేశంలో పాపులర్ హోమ్ లోన్ హౌసింగ్ పర్చేజ్ లోన్. ఇంటిలో నివసించడానికి లేదా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో దీనిని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దేశంలో హోమ్ లోన్ పర్చేజ్ వడ్డీ రేటు 7.35 శాతం నుండి ప్రారంభమవుతుంది. హోమ్ లోన్ వ్యాల్యూ పైన వివిధ బ్యాంకులు 90 శాతం వరకు రుణం అందిస్తాయి.

వివిధ రకాల హోమ్ లోన్స్ మీకు తెలుసా? 7 రకాలు తెలుసుకోండి

హోమ్ ఇంప్రూమెంట్ లోన్

హోమ్ ఇంప్రూమెంట్ లోన్ కూడా దేశంలో బెస్ట్ హోమ్ లోన్. రినోవేషన్ కోసం దీనిని తీసుకుంటారు. ప్రాపర్టీ స్ట్రక్చరల్ రిపైర్స్, రినోవేషన్ కోసం తీసకుంటారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ లేదా పెయింటింగ్ వర్క్స్ కోసం కూడా ఈ లోన్ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ముప్పై ఏళ్ల కాలపరిమితి ఉంటుంది.

హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్

హోమ్ కన్‌స్ట్రక్షన్ కోసం లోన్ తీసుకోవచ్చు. మీకు భూమి ఉంటే, అక్కడ ఇంటిని నిర్మించుకోవాలంటే హోమ్ లోన్ తీసుకోవచ్చు. మీకు సొంత స్థలం లేకుంటే మొదట ప్లాట్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి కన్‌స్ట్రక్షన్ కోసం ప్రాసెస్ ఉంటుంది.

రెసిడెన్షియల్ ప్లాట్ లోన్

ఇంటి నిర్మాణం లేదా పెట్టుబడి కోసం రెసిడెన్షియల్ ప్లాట్స్ కావాలంటే ప్లాట్స్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్లాట్ లోన్ వడ్డీ రేటు సాధారణంగా 8.35 శాతం నుండి 10.55 శాతం మధ్య ఉంది. సాధారణంగా రూ.20 లక్షల ప్లాట్ పైన 90 శాతం, రూ.20 లక్షల నుండి రూ.75 లక్షల మధ్య వ్యాల్యూ పైన 80 శాతం, రూ.75 లక్షలకు పైన వ్యాల్యూ పైన 75 శాతం వడ్డీ రేటు ఉంటుంది.

హోమ్ లోన్ ఎక్స్‌టెన్షన్ లోన్

తమకు ఇప్పటికే ఉన్న ఇంటికి మరింత ప్రాపర్టీని జోడించడం కోసం ఎక్స్‌టెన్షన్ లోన్ తీసుకోవచ్చు. మీ పిల్లలు, కిచెన్, గెస్ట్ రూమ్ ఇలా వివిధ రకాలుగా నిర్మించుకోవడానికి ఈ రుణం తీసుకోవచ్చు.

ఎన్నారైలకు లోన్

నాన్ రెసిడెంట్స్ ఇండియన్ (NRI) లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (PIO)లు ఎన్నారై లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్మాణం, కొనుగోలు, రిపేయిర్, రినోవేషన్ ఇలా వివిధ రకాల లోన్ తీసుకోవచ్చు. సాధారణంగా ప్రాపర్టీ వ్యాల్యూలో 80 శాతం వరకు రుణం ఇస్తారు. మార్కెట్ వ్యాల్యూపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు వివిధ బ్యాంకుల్లో వివిధ రకాలుగా ఉంటుంది.

హోమ్ కన్వర్షన్ లోన్

మీరు ఇప్పటికే ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా నిర్మించేందుకు రుణం పొంది ఉంటే, మళ్లీ కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే మీరు హోమ్ కన్వర్షన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post