PF ACCOUNT TRANSFER 2023
PF Rule: ఉద్యోగం మారుతున్నారా? పీఎఫ్ అకౌంట్ ఇలా ట్రాన్సుఫర్ చేయండి
సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు ఈపీఎఫ్‌ను బదలీ చేసుకుంటారు. డిజిటలైజేషన్ కారణంగా ఇప్పుడు ప్రతి అంశం ఆన్‌లైన్ ద్వారానే చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు చాలా పనులు ఇంటి వద్దనే మొబైల్ ద్వారా లేదా ల్యాప్‌టాప్ ద్వారా పూర్తవుతున్నాయి. ఇందులో ఈపీఎఫ్ కూడా ఉంది. ఇకపై ఈఫీఎప్ ఖాతాదారులు ఉద్యోగం మారిన సమయంలో పీఎఫ్ నగదును కొత్త కంపెనీకు చాలా సులభంగా బదలీ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌ను ఉద్యోగి స్వయంగా ఆన్‌లైన్ ద్వారా బదలీ చేసుకునే వెసులుబాటు ఉంది.
మీ పీఎఫ్ అకౌంట్‌ను ఇలా ట్రాన్సుఫర్ చేయవచ్చు
- మొదట EPFO అధికారిక వెబ్ సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface లోకి వెళ్లాలి.
- ఒకసారి పోర్టల్‌లోకి వెళ్లాక యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగ్-ఇన్ కావాలి.
- online services లోకి వెళ్లాలి. అది ఓపెన్ అయ్యాక One Member One EPF account (Transfer request) పైన క్లిక్ చేయాలి.
- అందులో మీ వ్యక్తిగత సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలి. ప్రస్తుత యాజమాన్య PF account వివరాలు వంటివి చెక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత Get details పైన క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేయగానే ప్రీవియస్ కంపెనీ వివరాలు కనిపిస్తాయి.
- ఆ తర్వాత ప్రస్తుత, పాత కంపెనీల్లో దేనికి ఖాతా బదిలీ చేయాలని భావిస్తున్నారో ఎంటర్ చేసి గెట్ డిటైల్స్ పైన ఓటీపీ కోసం క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత UAN రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీనీ నమోదు చేసి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి.
- ఒకసారి మీరు OTPని ఎంటర్ చేసిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా బదిలీ ప్రాసెస్ అభ్యర్థన మీ సంస్థకు చేరుతుంది. ఆన్‌లైన్ సర్వీసెస్ మెనూలోని ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్ ద్వారా మీ ఈపీఎఫ్ బదిలీ స్థితిని తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసేందుకు పాత లేదా ప్రస్తుత సంస్థకు ఫామ్ 13ను సబ్‌మిట్ చేయాలి.
అప్పుడు బదలీ...
- క్లెయిమ్, అభ్యర్థనను సమర్పించిన తర్వాత చేయవలసిందల్లా వేచి ఉండటం. ప్రస్తుత యజమాని లేదా మీ పాత కంపెనీ అవసరమైన ఫామ్‌ను ధృవీకరించిన తర్వాత మీ పీఎఫ్ ఖాతా అధికారికంగా బదలీ చేయబడుతుంది.
- ఉద్యోగిగా మీరు కూడా ఓ విషయం గుర్తుంచుకోవాలి. మీరు మీ ఆన్‌లైన్ పీఎప్ ట్రాన్సుఫర్ రిక్వెస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీని పదిరోజుల్లోపు యజమానికి సబ్‌మిట్ చేయాలి. దీనిని పీడీఎఫ్ ఫార్మాట్‌లో సమర్పించాలి.
- ఆ తర్వాత యజమాని పీఎఫ్ బదలీ అభ్యర్థనను డిజిటల్‌గా ఆమోదిస్తారు. దీనిని అనుసరించి, ప్రస్తుత యజమానికి కొత్త ఖాతా బదలీ చేయబడుతుంది.
ట్రాకింగ్ ఐడీ
- ఆప్లికేషన్‌ను ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకోవడానికి ట్రాకింగ్ ఐడీ కూడా రూపొందించబడింది. కొన్ని సందర్భాల్లో మీరు పీఎఫ్ బదలీ ప్రక్రియను పూర్తి చేయడానికి ట్రాన్సుఫర్ క్లెయిమ్ ఫామ్(ఫామ్ 13) డౌన్ లోడ్ చేసుకొని యజమానికి సమర్పించవలసి ఉంటుంది.
- ఆన్ లైన్ ఈపీఎఫ్ ఖాతాలు క్రమం తప్పకుండా అప్ డేట్ చేస్తారు. ఇందులో సెటిల్మెంట్స్, బదలీలు మొదలైన తాజాగా ఆమోదించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. అవసరమైన వివరాలు ఇచ్చిన తర్వాత మీరు అన్ని వివరాలకు యాక్సెస్ కావొచ్చు. అవసరమైన మార్పులు కూడా చేసుకోవచ్చు. సహజంగా ఉద్యోగి కంపెనీ మారినప్పుడు ఇవి ఉపయోగపడతాయి.
COMMENTS