GAS AGENCY 2023
గ్యాస్ ఏజెన్సీతో మంచి ఆదాయం.. ఎలా లైసెన్స్ తీసుకుని ప్రారంభించాలి..? పూర్తి వివరాలు..
Gas Agency: దేశంలోని వంట గ్యాస్ పంపిణీ కంపెనీలు ఇండియన్ ఆయిల్- ఇండేన్, భారత్ పెట్రోలియం- భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం- HP గ్యాస్. ఇవి ప్రభుత్వ రంగంలోని కంపెనీలకు చెందిన గ్యాస్ కంపెనీలు. ఇవి డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ ద్వారా వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంటాయి. ప్రజలు వీటినే గ్యాస్ ఏజెన్సీ అవి వాడుక బాషలో వ్యవహరిస్తుంటారు. గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం.. ఈ గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. కంపెనీలు విధించే నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించడానికి లైసెన్స్ పొందాలి. ఏజెన్సీలను మంజూరు చేసేందుకు కంపెనీలు ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరిస్తుంటాయి.
దరఖాస్తు విధానం..
హిందుస్థాన్ పెట్రోలియం వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించాలనుకునే అభ్యర్థులు వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత వ్యక్తి ఎంపికైతే ఇంటర్వ్యూకు పిలవబడతారు. ప్యారామీటర్స్ ప్రకారం గ్యాస్ ఏజెన్సీ యజమానులు ఎంపిక చేయబడతారు. ఇంటర్వ్యూ తర్వాత షార్ట్‌లిస్ట్ అయిన వ్యక్తుల జాబితా వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. ఆ తర్వాత దీనికోసం అవసరమైన పత్రాలను అందించాల్సి ఉంటుంది.
పరిశీలన..
పత్రాలను పరిశీలించిన తర్వాత సంబంధిత కంపెనీ నేరుగా గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసే స్థలం, స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలిస్తుంది. స్వంత స్థలం లేకపోతే.. తప్పనిసరిగా 15 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న స్థలాలను కలిగి ఉండాలి.
ఫుల్ డిటైల్స్.. ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు?
50 శాతం దరఖాస్తులు రిజర్వేషన్ ప్రాతిపదికన ఇవ్వటం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఇందులో ఉంటుంది. నిబంధనల ప్రకారం స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, సాయుధ దళాల సిబ్బంది, పదవీ విరమణ పొందిన పోలీసులు, జాతీయ క్రీడాకారులు, సామాజికంగా వికలాంగులు రిజర్వేషన్ల ప్రయోజనం పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..
LPG డిస్ట్రిబ్యూషన్ కోసం దరఖాస్తులు వార్తాపత్రికలలో తెలియజేయబడతాయి. సంబంధిత సమాచారం https://www.lpgvitarakchayan.in పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంది. పట్టణ, శివారు ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాలంటే కనీసం.. రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది.
సిలిండర్ అమ్మకంపై ఆదాయం..?
14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌ను విక్రయించినందుకు గ్యాస్ ఏజెన్సీలకు కనీసం రూ.61 84 కమిషన్ లభిస్తుంది. 5 కిలోల సిలిండర్ విక్రయిస్తే రూ.30.09 కమిషన్ రూపంలో కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు అందిస్తాయి.
COMMENTS