NEW YEAR NEW NOTES
ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మీ వద్ద పాత నోట్లు ఉన్నాయా..? కొత్త నోట్లను పొందవచ్చు.. ఎలాగంటే
చాలా మంది దగ్గర పాత నోట్లు ఉంటాయి. అందులో చిరిగిపోయినవి.. లేక పూర్తిగా పాతబడినవి ఉంటాయి. అలాంటి వారు ఎలాంటి టెన్షన్ పడకుండా కొత్త నోట్లను మార్చుకునే వెసులుబాటు ఆర్బీఐ కల్పించింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. కస్టమర్ల కోసం పీఎన్‌బీ బ్యాంకు కస్టమర్ల కోసం ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. మీ వద్ద పాత నోట్లు ఏమైనా ఉండి.. వాటిని చెల్లించే విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ కొత్త సంవత్సరంలో కొత్త నోట్లను పొందాలనుకుంటే మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వెళ్లాలి. ఇలాంటి నోట్లను మార్చుకుని కొత్త నోట్లను తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా కొత్త నోట్ల పంపిణీ గురించి సమాచారం ఇచ్చింది. కొత్త ఏడాదికి కొత్త నోట్లు అంటూ ట్వీట్ చేసింది సదరు బ్యాంకు.
న్యూ ఇయర్ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అద్భుతమైన ఆఫర్లతో ముందుకు వచ్చింది. డిసెంబరు 28న బ్యాంకు నుంచి ఒక సందేశం వచ్చింది. ఇందులో కొత్త సంవత్సరం, కొత్త నోట్లు అని బ్యాంకు ట్వీట్ చేసింది. పాత నోట్లను మార్చుకోవడం ద్వారా కొత్త నోట్లు లేదా నాణేలు పొందవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. మీరు మ్యుటిలేట్ చేసిన నోట్లను కలిగి ఉంటే, మీరు వాటిని మార్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ పనిని చేయవచ్చు. మీరు మీ స్వంత బ్యాంకు మీ స్వంత శాఖను సందర్శించాలి. అయితే మీ వద్ద ఉండే పాత నోట్లను తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చు. నోట్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే దాని విలువ తగ్గుతుందని మీరు గుర్తుంచుకోవాలి.
COMMENTS