Supreme Court's sensational comments on Compassionate appointment
కారుణ్య నియామకం హక్కు కాదు సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు వివరాలు.
కారుణ్య నియామకం హక్కు కాదని వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకం హక్కు కాదని అనుకోకుండా ఎదురైన ప్రతికూల సందర్భం నుంచి బాధిత కుటుంబానికి ఉపశమనం కలిగించడమే కారుణ్య నియామకం ఉద్దేశమని తెలిపింది.
ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ కంపెనీ కారుణ్య ఉపాధి కోసం మహిళ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించాలని, ఈ మేరకు సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థిస్తూ కేరళ హైకోర్టు ధ్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురళీతో కూడిన ధర్మాసనం గతవారం పక్కనపెట్టింది.
కేసు వేసిన మహిళ తండ్రి సదరు కంపెనీలో పనిచేశారు. ఆమె తండ్రి 1995 ఏప్రిల్‌లో విధి నిర్వహణలో మరణించారు. ఆయన మరణించే సమయంలో అతని భార్య సర్వీస్‌లో ఉన్నందున.. కారుణ్య ప్రాతిపదిక నియామక అర్హత లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా పేర్కొన్నది. ఉద్యోగి మరణించిన 24 ఏళ్ల తర్వాత ప్రతివాది కారుణ్య నియామకానికి అర్హులు కాదని ధర్మాసనం పేర్కొంది. మరణించిన వ్యక్తిపై కుటుంబం ఆధారపడి ఉంటే.. కారుణ్య నియామకం ఇవ్వడం అనేది ఉద్యోగాల నియామకాల విషయంలో పేర్కొన్న నిబంధనలకు మినహాయింపు అని తీర్పులో తెలిపింది. కారుణ్య నియామకమనేది మినహాయింపు మాత్రమేనని, హక్కు కాదని మరోసారి స్పష్టం చేసింది.
కారుణ్య ప్రాతిపదికన నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టం చేసిన చట్టం ప్రకారం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16 ప్రకారం అన్ని ప్రభుత్వ ఖాళీలకు అభ్యర్థులందరికీ సమాన అవకాశం కల్పించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం గురించి, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాల గురించి తెలియజేస్తుంది. అయితే, మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన వ్యక్తికి కారుణ్య నియామకం ఈ నిబంధనలకు మినహాయింపు అని బెంచ్ సెప్టెంబర్ 30న తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కారుణ్య ప్రాతిపదికన నియామకం ఒక మినహాయింపు మాత్రమేననీ, హక్కు కాదని పేర్కొంది.
అసలేం జరిగిందంటే..?
1995లో ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి చనిపోతే.. అతని కూతురు మైనర్ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. మృతుడి భార్య ఉద్యోగంలో ఉంది. మృతుడి కూతురు పెద్దయ్యాక కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేసింది. తన తండ్రి మరణించిన 14 ఏళ్ల తర్వాత మహిళ ఈ దరఖాస్తును దాఖలు చేసింది. తన తండ్రి చనిపోయాడని ఆ మహిళ కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోరింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది.
సాధారణ ఉద్యోగ నియమాల ప్రకారం.. కారుణ్య నియమకం మాత్రమేననీ పేర్కొంది. ఇది మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యునికి అందజేయబడుతుంది, తద్వారా వారు వారి జీవనోపాధిపై మోపబడిన భారం నుండి ఉపశమనం పొందుతారు. అటువంటి సందర్భంలో మానవత్వ ప్రాతిపదిక తీసుకోబడుతుండటమే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యమని పేర్కొంది. కేరళ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఎరువుల కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. కంపెనీ దరఖాస్తును సుప్రీంకోర్టు స్వీకరించింది.
COMMENTS