Carrot Cultivation : క్యారెట్ సాగులో తెగుళ్ళు , నివారణ
Carrot Cultivation : ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. మార్కెట్లో క్యారెట్ కు మంచి డిమాండ్ ఉంది. ఇటీవలికాలంలో క్యారెట్ సాగువైపు రైతాంగం మొగ్గుచూపుతుంది. క్యారెట్ పండించే రైతాంగం తెగుళ్ళ సమస్యతో అనేక ఇబ్బందులను చవిచూడాల్సి వస్తుంది. తెగుళ్ళ కారణంగా పంట దిగుబడి తగ్గటంతోపాటు, మార్కెట్లో పండిన పంటకు సరైన ధర దక్కని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో క్యారెట్ సాగు చేపట్టే రైతులు వాటికి వచ్చే తెగుళ్ళు, నివారణా మార్గాల గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం.
క్యారెట్ పంటకు ఎక్కువగా వచ్చే తెగులు ఆకుముడత. వెచ్చని తేమతో కూడిన ప్రదేశాలలో బ్యాక్టీరియా వృద్ధి చెందటం తద్వారా ఆకుముడత తెగులు వ్యాప్తికి కారణమౌతుంది. ఓమిసైట్సు పైథియం వయోలే, పైథియం ఆశించటం వల్ల ప్రధాన దుంప కుహర భాగం అకారంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. గాయలు పడినట్లుగా, గాట్లు దుంపపైభాగంలో కనిపిస్తాయి.
దుంప పెరిగే సమయంలో పగుళ్ళు ఏర్పడటానికి ఈ తెగుళ్ళు ప్రధాన కారణంగా మారుతాయి. వేరు పొడవులో కొన్ని సెంటీమీటర్లు విచ్ఛిన్నం అవుతాయి. ఇలాంటి రుగ్మతల వల్ల క్యారెట్ కు సరైన ధర లభించన పరిస్ధితి ఎదురవుతుంది. బ్యాక్టీరియా మచ్చ తెగులు వల్ల కూడా క్యారెట్ పంట దెబ్బతింటుంది. ఆకులపై పసుపు, గోధుమ రంగు మచ్చలు కలిగి ఉంటాయి. క్రమేపి ఆకులు ముడుచుకుపోయి చనిపోతాయి. పంట వేసే ముందు విత్తనాలను వేడినీటితో శుద్ధి చేయాలి. పంట మార్పిడి చర్యలు చేపట్టాల్సి అవసరం ఉంది. తద్వారా తెగుళ్ళకు అస్కారం లేకుండా చూడవచ్చు.
క్యారెట్ పంట చలికాలంలో పండించే పంట, బంక నేలల్లో క్యారెట్ ను సాగుచేయకపోవటమే మంచిది. ఎకరానికి 2కిలోల విత్తనం అవసరం కాగా, విత్తే ముందు 5మిల్లీలీటర్లు ఇమిడాక్లోరోఫిడ్, థైరమ్ 3గ్రాములు కలిపి విత్తన శుద్ధ చేసుకోవటం వల్ల తెగుళ్ళ బారిన పడకుండా పంటను కాపాడుకోవచ్చు. క్యారెట్ పెరుగుదల దశలో సూక్మ పోషకాల లోపాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు ఫార్ములా 6 లీటరు నీటికి 5గ్రాములు కలిపి విత్తిన 20 రోజుల నుండి 10రోజుల వ్యవధిలో పిచికారి చేసుకుంటే సూక్మపోషకాల లోపాలను నివారించవచ్చు.
క్యారెట్ ఫ్లష్ ఫై అనే పురుగు మొక్క పైభాగంలో కాకుండా కాండ బాగంలోకి చేరి పంటకు తీవ్రనష్టం కలుగ చేసే అవకాశం ఉంటుంది. ఈ పురుగు కారణంగా దుంప కుళ్ళిపోయి మొక్క వాడిపోతుంది. మలాథియాన్ లీటరు నీటికి 2మిల్లీలీటరు చొప్పున పిచికారి చేసుకోవాలి. విత్తిన 4,7,10 వారాల్లో లీటరు నీటికి 2మిల్లీలీటర్లు మలాథియాన్ 3గ్రాముల సల్ఫర్ కలిపి పిచికారి చేసుకుంటే క్యారెట్లో వచ్చే పురుగులను సమర్ధవంతంగా నివారించుకోవచ్చు. 80 నుండి 100 రోజుల లోపు క్యారెట్ పంట చేతికి వస్తుంది. మార్కెట్లో మంచి ధర లభించేందుకు క్యారెట్ సాగులో రైతులు సరైన మెళుకువలు పాటించాల్సిన అవసరం ఉంది.
COMMENTS