Banana Plantations : వేసవిలో అరటితోటల యాజమాన్యం
Banana Plantations : వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలు కారణంగా అన్ని రకాల అరటి తోటలు ఎక్కువ శాతం నష్టానికి గురవుతాయి. వేసవి తీవ్రతకు పచ్చ అరటి త్వరగా నష్టానికి గురి అవుతుంది. పొట్టిపచ్చ అరటి , కర్పూర చక్కెరకేలి, కె.బి.యస్-8 అధిక ఉష్ణోగ్రతలను కొంత వరకు తట్టుకోగలవు. వేసవి కాలంలో తేలిక నేలల్లో ప్రతి 2 రోజులకు, బరువు నేలల్లో ప్రతి ఈ రోజులకు నీటి తడులు ఇచ్చినట్లయితే వేడిని చాలా వరకు తట్టుకోగలుగుతాయి. అధిక ఉష్టోగ్రతల తాకిడికి ముందుగా లేత అకులు తరువాత ముదురు అకులు ఎండిపోతాయి. లేత గెలలు నల్లగా మాడిపోతాయి. కోసిన గెలలలోని కాయలు త్వరగా పండుబారతాయి. పండ్లు ఉడికించినట్లుగా మెత్తబడి నీరుకారి సాధారణ రుచి, నిల్వ సామర్థ్యాలను కోల్పోతాయి. వేసవికి దెబ్బతిన్న గెలలు అమ్మకానికి పనికి రావు.
వేసవిలో యాజమాన్య పద్ధతులు:
వేసవిలో నాలుగు మాసాల లోపు తోటల అకులు పూర్తిగా ఎండిపోతాయి. తడులు ౩ రోజుల కొకసారి అందించలేని పరిస్థితుల్లో కాండం మరియు దుంప కూడ ఎండి, కుల్ళిపోతుంది. ఎండలు తగ్గిన తరువాత చెట్లు చిగురించి మామూలు ఎదుగుదలకు ప్రతి 3 లేక 4 రోజుల కొకసారి నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎరువులను తక్కువ మోతాదులో దగ్గర దగ్గరగా ఎక్కువసార్లు అందివ్వాలి. ఒకటి లేక రెందు మాసాల వయసుగల తోటల్లో ఎక్కువ శాతం మొక్కలు చనిపోత్కే వాటిని దున్ని మరల జూన్, జూలై నెలల్లో నాటుకోవాలి.
వేసవిలో ఐదు మాసాల పైబడిన తోటల అకులు ఎండిపోతాయి. దుంపకు మరియు కాండానికి తక్కువ నష్టం కలుగుతుంది. గెలవేయటానికి గల సమయం తక్కువగా ఉన్నందున చిన్న గెలలు వేస్తాయి. పెద్ద గెలలు వేసినా సరిగా పక్వానికి రావు. ఇటువంటి తోటలకు ప్రతి 4 రోజులకు తప్పనిసరిగా నీటితడి ఇవ్వాలి. ఎరువులను సిఫార్సు చేసిన మోతాదు కన్నా 50 శాతం అదనంగా ఇవ్వాలి. గెల వేసే సమయంలో గెలలో పండ్ల ఎదుగుదల ఆధారంగా లీటరు నీటికి 5 గ్రా. పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్‌లను మార్చి జిగురుతో కలిపి వారం రోజుల వ్యవధితో నాలుగుసార్లు అకులు గెలలు పూర్తిగా తడిసే విధంగా పిచికారి చేయాలి.
గెలలు వేస్తున్న, గెలలు వేయటానికి సిద్ధంగా వున్న మరియు లేత గెలలతో ఉన్న తోటల్లో తీవ్రమైన ఎండ మరియు వడగాలులకు అకులు పూర్తిగా మాడి, ఎండిపోతాయి. పచ్చ అరటి రకాల్లో గెలలు కూడ రాలిపడిపోతాయి. ఈ దశలో ఉన్న తోటలకు ఇరిగే నష్టం ఎక్కువ. తగిన సమయం లేనందున నష్టాన్ని పూరించటానిడి అవకాశం లేదు. ఇటువంటి తోటలకు నీటి తడులు దగ్గర దగ్గరగా పెట్టాలి. తొండంతో సహా గెల మొత్తానికి ఎండు అకు చుట్టి ఎండ నుండి రక్షణ కల్పించాలి.
లీటరు నీటికి 5 గ్రా. పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్‌లను మార్చి మార్చి జిగురుతో కలిపి వారం రోజుల వ్యవధితో నాలుగు సార్లు అకులు, గెలలు పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసి జరిగిన నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. చెట్ల అకులు పూర్తిగా మాడిన తోటల్లో ఆరోగ్యంగా వున్న పిలకలను కార్మితోటగా పెంచటం మంచిది. వేసవిలో గెలలు సగం లేక ఆపైన తయారైన దశలో ఉన్న తోటల ఆకులు,గెలలు ఎండిపోతాయి. చెట్లు విరిగిపడిపోతాయి. గెలలు కోసిన తర్వాత పండి, రుచి తగ్గి, నిల్వ సామర్థ్యం కోల్పోతుంది. ఇటువంటి. గెలల్లోని కాయలు ఉడికించినట్లుగా ఉండటంతో మార్కెట్‌లో మంచి ధర రాదు. ఇటువంటి చెట్ల గెలలకు ఎండు అకు చుట్టి ఎండ నుండి రక్షించాలి. పక్వానికి వచ్చిన గెలలను ఉదయం పూట చల్లని వాతావరణంలో మాత్రమే కోసి నీడవున్న ప్రదేశంలో ఉంచాలి.
2 నుండి 3 నెలల వయసున్న సూది పిలకలను. ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకొని అరటి తోటలకు నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. అవిశె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 4 వరుసల్లో అరటీతోపాటు నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి. అరటి తోటను సిఫార్సు చేసిన సాంద్రేతలోనే నాటుకొని తోటలోని మొక్కలన్నీ బ్రతికి ఉండే విధంగా జాగ్రత్త పడాలి. నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసవి కాలంలో తడులివ్వాలి. తేలిక నేలల్లో రెండు నుండి మూడు రోజులకు నీరు పెట్టాలి. మార్చి నెల నుండి 10 నుండి 16 రోజులకొకసారి చొప్పున పొటాషియం సల్ఫేటు (0.5 శాతం) మండే ద్రావణాన్ని జిగురు మందుతో కలిపి పైరు పూర్తిగా తడిసేవిధంగా పిచికారి చేస్తే అరటికి వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకానే శక్తి కలుగుతుంది.
COMMENTS