థాయిలాండ్ దేశం గురించి మీకు తెలియని నిజాలు
Thailand country facts : యువతను ఎక్కువగా ఆకర్షించే దేశం ఏదైనా ఉంది అంటే అది థాయిలాండ్ దేశం మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ గా ఈ థాయిలాండ్ దేశం ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ గా థాయిలాండ్ దేశం ప్రసిద్ధి చెందింది.
ఇటువంటి దేశం గురించి మీకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం.
- థాయిలాండ్ ఫ్రెండ్లీ నేచర్ కలిగిన దేశం. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అతిథులను ఇక్కడ గౌరవంగా ఆహ్వానిస్తారు.
- థాయిలాండ్ సుమారు 5 లక్షల 13 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
- ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం. అతిపెద్ద జనాభా కలిగిన దేశాలలో స్థాయిలను 20వ స్థానంలో ఉంది.
- ఈ దేశంలోని జనాభా సుమారు 7 కోట్ల వరకు ఉన్నారు.
- థాయిలాండ్ దేశం బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ 94 శాతం మంది బౌద్ధ మతాన్ని పాటిస్తారు. అయినా కూడా ఇక్కడి ప్రజలు హిందూ దేశంలో పూజించే భగవాన్ రాముడు, కృష్ణుడి నీ ఇష్టం గా పూజిస్తారు.
- ఇండియా కి థాయిలాండ్ కి మధ్య ఒక కామన్ పాయింట్ రామాయణం. భారతీయులకి రామాయణం ఒక పెద్ద పవిత్ర గ్రంథం. కానీ ఆశ్చర్యమేమిటంటే థాయిలాండ్ దేశం యొక్క నేషనల్ బుక్ మరియు రాష్ట్రీయ గ్రంథం ఈ రామాయణం. భారతదేశంలోని ప్రజలు అలాగే అక్కడ ప్రజలు కూడా రామాయణాన్ని చదువుతారు, పాటిస్తారు. రామాయణ గ్రంథము ను ఇక్కడ రామ్ కీర్ అని పిలుస్తారు.
- థాయిలాండ్ దేశం లో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మ దేవాలయం ఉంది. స్వయంగా ఇక్కడి ప్రజలు బ్రహ్మదేవునికి ఆలయాన్ని కట్టారు. నిత్యం బ్రహ్మదేవుని పూజిస్తారు.
- ఈ దేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది అది థాయిలాండ్ యొక్క రాజధాని. ఈ దేశం యొక్క రాజధాని బ్యాంకాక్.
- బ్యాంకాక్ లో భక్తి, రక్తి రెండు ఉంటాయి. నైట్ లైఫ్ చూడడానికి కలర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే యువత బ్యాంకాక్ చూడడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు.
- బ్యాంకాక్ థాయ్ మసాజ్ కి పెట్టింది పేరు. ఇక్కడ ఏ వీధిలో చూసినా థాయ్ మసాజ్ సెంటర్లు కనిపిస్తాయి.
- థాయ్ మసాజ్ అనేది వాళ్ళకి సాంప్రదాయమైన వైద్య విధానం అని చెప్తారు. ఇతరులకు దీని మీద ఏ ఉద్దేశం ఉన్న వాళ్లు మాత్రం ఈ మసాజ్ ను పవిత్రంగానే భావిస్తారు. థాయిలాండ్ వచ్చిన వాళ్ళు కచ్చితంగా థాయ్ మసాజ్ చేసుకునే వెళ్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి థాయ్ మసాజ్ ఇక్కడ ఆచారంగా కొనసాగుతోంది.
- భారతదేశంలో కేరళ ఆయుర్వేదం ఎంత ప్రాచుర్యం పొందిందో అదేవిధంగా థాయిలాండ్ లో థాయ్ మసాజ్ ప్రాచుర్యం పొందింది.
- థాయిలాండ్ శృంగారానికి సంబంధించిన వంటి పనులకు కూడా ఇక్కడ ప్రాచుర్యం పొందింది.
- ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడ శృంగారానికి సంబంధించిన పనుల కోసమే వస్తున్నారని ఒక అపోహ ఉంది. అందువల్లనే అక్కడి ప్రభుత్వం కొన్ని నిబంధనలను కఠినతరం చేసిం
- Thailand దేశం వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే డబ్బు కావాలి. థాయిలాండ్ దేశం లోని కరెన్సీని థాయ్ బాత్ అంటారు. ఒక థాయ్ బాత్ వచ్చేసి భారతదేశంలో రెండు రూపాయల నలభై పైసలు ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్ లోనే థాయిలాండ్ కి వెళ్లి రావచ్చు.
- థాయ్ దేశం ఆదాయం ఎక్కువగా టూరిస్టులు, పర్యాటకుల వల్లే వస్తుంది.
- ఆసియా ఖండంలోనే అతిపెద్ద బల్లి థాయిలాండ్ దేశంలో ఉంది. ఇది ఏడు అడుగుల వరకు పెరుగుతుంది.
- ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్ చేప ఈ దేశం లోనే ఉంది. దీని పేరు వేల్ షార్క్. ఇది 46 అడుగుల పొడవు ఉంటుంది.
- ప్రపంచంలోనే అతి పెద్దదైన పాము Reticlated పైథాన్. ఇది 10 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ పైతాన్ కూడా థాయిలాండ్ దేశం లోనే ఉంది.
- ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు బుద్ధ విగ్రహం కూడా ఈ దేశం లోనే ఉంది. దీని బరువు 5,500 కేజీలు.
- థాయిలాండ్ 1300 కంటే ఎక్కువ ద్వీపాలను కలిగి ఉంది. ఇక్కడ ఉండే అందమైన బీచ్ లను చూడడానికి పర్యాటకులు వస్తుంటారు.
COMMENTS