భారత రాజ్యాంగ యొక్క ప్రకరణ 368 నిబంధన
1 . రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ సంవిధాయ కాధికారం ?
1. రాజ్యాంగ నిబంధనలను అదనంగా చేర్చటం , మార్చటం లేదా తొలగించడం లాంటి మార్గాల ద్వారా సవరించే అధికారం
2. ఏదైనా స్వతహా సిద్ధ మరియు ఇమిడి ఉన్న పరిమితుల ద్వారా ఇది అపరితమైనది .
3. ఇది సంవిధానాధికారానికి వెలుపలిది .
4. ఇది విధాన పరంగా పరిమితమైంది మరియు నిరోధించబడినది కాదు .
2 . భారత రాజ్యాంగ యొక్క ప్రకరణ 368 నిబంధన దేనితో వ్యవహరించును ?
1. రాజ్యాంగ సవరణ అధికారం మరియు అలాగే విధానం
2. పార్లమెంట్ అనుసరించే రాజ్యాంగ సవరణ విధానం
3. రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారం
4. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్ర శాసనసభలు ఆమోదించడం మరియు ఆమోదించకపోవడం .
3. రాజ్యాంగ సవరణ దేనిలో మార్పులు చేయాలనుకుంటే ఒకటిలో అరవంతు రాష్ట్ర శాసన సభలు తీర్మానం ద్వారా కూడా ఆమోదించాలి ?
1. ప్రాథమిక హక్కులు
2. ఆదేశిక సూత్రాలు
3. ప్రాథమిక విధులు
4. హైకోర్టు నిబంధనలు
4 . ఈ కింది వాటిలో ఏ అంశాలపై పార్లమెంట్ సాధారణ మెజారిటీలో రాజ్యాంగ నిబంధనలను మార్పులు చేసే అధికారం కలిగి ఉంటుంది ?
1. ఆదివాసీ ప్రాంతాల పాలన
2. అదనపు న్యాయమూర్తుల నియామకం
3. రాష్ట్రాల భూభాగము , సరిహద్దులు మరియు పేర్లు మార్పులు చేయడం.
4. రాష్ట్ర శాసన సభలోని ద్వీతీయ సభను రద్దు చేయడం .
5 . ఈ కింది వ్యాఖ్యలను పరిశీలింపుము ?
ఎ . భారత రాజ్యాంగ సవరణ లోక్సభలో మాత్రమే బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా మొదలవుతుంది .
బి . భారత రాజ్యాంగ సవరణ కొరకు ప్రవేశపెట్టిన బిల్లును ఉభయ సభలో మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యులతో ఆమోదించబడాలి మరియు హాజరైన సభ్యులలో మూడింటి రెండు వంతుల సభ్యులకు తగ్గకుండా మెజారిటీ ఆమోదించాలి .
పైన పేర్కొనబడిన వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనవి?
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ మరియు బి
4. ఎ కాదు మరియు బి కాదు
6 . పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన అనంతరం , రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును స్వీకరించిన తదుపరి
1. తన ఆమోదాన్ని తప్పక ఇస్తారు
2. తన ఆమోదాన్ని ఇవ్వవచ్చు
3. తన ఆమోదాన్ని నిలిపి ఉండవచ్చు
4. పున : పరిశీలనకు బిల్లును తిప్పి పంపవచ్చు
7. రాజ్యాంగం యొక్క నిబంధన 226 కింద హైకోర్టుల అదిలేఖ అధికార పరిమితపరచడం దేని ద్వారా సాధ్యము ?
1. రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ప్రతి సభలోనూ మొత్తం హాజరై ఓటువేసిన సభ్యులలో మూడింట రెండువంతుల సభ్యుల మెజారిటీ మరియు నాలుగింట మూడు వంతుల రాష్ట్ర శాసనసభలలో ఆమోదించబడాలి .
2. రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ప్రతి సభలోనూ మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యులతో మరియు ప్రతిసభలో హాజరై ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతుల సభ్యుల మెజారిటీతో పాటు సగం రాష్ట్ర శానససభలు సమ్మతించి ఆమోదించబడాలి .
3. రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ఉభయ సభలో హాజరై ఓటేసిన సభ్యులలో సాధారణ మెజారిటీ సభ్యులతో ఆమోదించాలి .
4. రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ప్రతి సభలోనూ మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యులతో మరియు ప్రతి సభలో హాజరై ఓటు వేసిన సభ్యులలో ముండింట రెండువంతుల సభ్యుల మెజారిటీతో ఆమోదించబడాలి .
8 . ఈ కింది వానిలో ఏ లక్షణాలు భారత రాజ్యాంగంలో కలవు .
ఎ . సవరణ బహుళ విధానాలు కలవు
బి . రాజ్యాంగ సవరణను మొదలుపెట్టేందుకు రాష్ట్రాలకు అధికారం లేదు .
సి . రాజ్యాంగ సవరణకు సంబంధించి వివాదమును పరిష్కరించుటకు పార్లమెంట్ సంయుక్త సమావేశములు .
కింది పేర్కొన్న కోడ్లను ఉపయోగించి సరైన సమాధానము ఎంపిక చేయండి.
1. ఎ మరియు బి
2. బి మరియు సి
3. ఎ మరియు సి
4. ఎ , బి మరియు సి
9 . ఈ కింది ఏ రాజ్యాంగ నిబంధన సవరణ కొరకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరమైంది ?
1. నిబంధన 54 , రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినది .
2. నిబంధన 56 , రాష్ట్రపతి పదవీ కాలానికి సంబంధించినది .
3. నిబంధన 123 , పార్లమెంట్ సమావేశాలలో లేనపుడు ఉ మ్మడి జాబితాలోని ఒక విషయంపై అధ్యాదేశం ( ఆర్డినెన్స్ ) జారీచేసే రాష్ట్రపతి అధికారానికి సంబంధించినది .
4. నిబంధన 157 , రాష్ట్ర గవర్నర్గా నియమించ బడానికి కావలసిన అర్హతలకు సంబంధించినది .
10. నూతన రాష్ట్రము ఏర్పాటు చేయుట కొరకు ఉద్దేశించిన భారత రాజ్యాంగ సవరణ దేని ద్వారా ఆమోదించబడాలి .
1. పార్లమెంట్ సాధారణ మెజారిటీతో
2. పార్లమెంట్లో సాధారణ మెజారిటీతో మరియు సగానికి తగ్గకుండా రాష్ట్రాల ఆమోదంతో
3. పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ మరియు ముడింట రెండు వంతులకు తగ్గకుండా రాష్ట్రాలతో ఆమోదింపబడాలి .
4. పార్లమెంట్ ఉభయ సభలలో హాజరై మరియు ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతుల సభ్యులు .
Answers ::
1 ) 1 , 2 ) 1 , 3 ) 4 , 4 ) 4 , 5 ) 2 , 6 ) 1 , 7 ) 2 , 8 ) 1 , 9 ) 1 , 10 ) 1
COMMENTS