పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
1 . పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రులు వీరి చేత నియమింపబడతారు ?
1. రాజ్యాధిపతి , అతని విచక్షణతో
2. ప్రభుత్వాధిపతి
3. శాసన వ్యవస్థ
4. ప్రభుత్వాధిపతి సలహా మేరకు రాజ్యాధిపతి
2 . పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రిమండలిలోని సభ్యులందరూ సమీష్టగా వీరికి బాధ్యులు ?
1. ప్రధానమంత్రి
2. పార్లమెంట్ యొక్క ప్రజామోద సభ
3. రాజ్యాధిపతి
4. ఎగువసభ ఛైర్మన్ మరియు దిగువ సభ స్పీకర్
3 . ఈ కింది వాటిలో ఏవి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలు ?
ఎ . నామమాత్రపు రాజ్యాధిపతిని కల్గి ఉండటం
బి . అధికారాల వేర్పాటు
సి . శాసనసభకు , కార్యనిర్వహక వర్గ జవాబుదారీతనం
డి . క్యాబినెట్ యొక్క సమిష్టి బాధ్యత
1. ఎ , బి మరియు సి
2. ఎ , సి మరియు డి
3. ఎ , బి మరియు డి
4. బి , సి మరియు డి 1
4 .ఈ కింది వాటిని జతపరచండి ప్రభుత్వ తరహాలు--------లక్షణాలు
1. పార్లమెంటరీ ప్రభుత్వం ఎ . అధికార కేంద్రీకరణ
2. అధ్యక్ష ప్రభుత్వం బి . అధికారాల విభజన
3. సమాఖ్య వ్యవస్థ సి . అధికారాల వేర్పాటు
4. ఏకకేంద్ర వ్యవస్థ డి . సమిష్టి బాధ్యత
1. 1 - ఎ , 2 - బి , 3 - సి , 4 - డి
2. 1 - బి , 2 - సి , 3 - డి , 4 - ఎ
3. 1 - సి , 2 - డి , 3 - ఎ , 4 - బి
4. 1 - డి , 2 - సి , 3 - బి , 4 - ఎ
5 . ఈ కింది వానిలో ఏది పార్లమెంటరీ వ్యవస్థకు అవశ్యకము కాని లక్షణము ?
1. సమిష్టి బాధ్యత
2. నామమాత్రపు రాజ్యాధిపతి
3. కార్యనిర్వాహక వర్గం యొక్క నిర్ణీత వ్యవధి పదవీకాలం
4. శాసన వ్యవస్థ మరియు కార్యనిర్వాహణ వర్గ సమ్మేళనం
6 .కాబినెట్ తరహా ప్రభుత్వంలో , సాధారణంగా కాబినెట్ పదవీకాలం?
1. నిర్ణీత కాలం వరకు
2. శాసన వ్యవస్థలో ప్రజామోదసభ విశ్వాసాన్ని పొందినంత కాలం .
3. ఇది ఓటరుల విశ్వాసాన్ని పొందినంత కాలం
4. ఇది రాజ్యాధిపతి విశ్వాసాన్ని పొందినంత కాలం
7 . భారత రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వంను ఏర్పాటు చేసింది మరియు ఈ తరహా ప్రభుత్వం సారాంశం ఏమిటంటే వీరికి అది బాధ్యత వహిస్తుంది ?
1. ప్రధానమంత్రి
2. శాసనసభ
3. అధ్యక్షుడు
4. భారత ప్రజలు
8 . భారతదేశంలోని పార్లమెంటరీ వ్యవస్థ తరహా ప్రభుత్వం నిర్వహించబడుతుంది ?
ఎ . నామమాత్రపు కార్య నిర్వహక అధిపతి
బి . ఎగువసభ ఛైర్మన్గా ఉపరాష్ట్రపతి
సి . మంత్రిమండలితో నిజ కార్యనిర్వాహక అధికారం
డి . దిగువ సభకు కార్యనిర్వాహక శాఖ భాద్యత
1. ఎ , బి మరియు డి
2. ఎ , బి మరియు సి
3. ఎ.సి మరియు డి
4. బి , సి & డి
Answers ::
1 ) 4 , 2 ) 2 , 3 ) 1 , 4 ) 4 , 5 ) 3 , 6 ) 2 , 7 ) 2 , 8 ) 3
COMMENTS