మన జాతీయ పక్షి నెమలి గురించి తెలుసుకుందాం
National bird peacock : మన భారతదేశ జాతీయ పక్షిగా అందాల హరివిల్లు లాంటి మయూరం ఎంపిక చేశారు. నెమలి చాలా అందమైన పక్షి. నెమలికి చాలా పొడవైన అతి అందమైన రంగురంగుల తోక ఉంటుంది. తన తోకను పూర్తిగా విసనకర్ర మాదిరిగా తెరిచి, నాట్యం చేస్తుంటే నెమలి ఎంతో రాజసంగా కనిపిస్తుంది. జాతీయ పక్షి హోదాకు తగినట్లుగానే కనిపిస్తుంది. 4 అడుగుల పొడవు ఉండే ఈ తోకలో ఆకుపచ్చని ఈకలు వాటి మధ్యలో నీలపు రంగు కళ్ళు, కళ్ళ చుట్టు రాగి మరియు గోధుమ రంగు మిశ్రపు అంచులు ఉంటాయి. నెమలి శరీరం ఆకుపచ్చ, నీలం రంగుల మిశ్రమం లో ఉంటుంది. దీని తల మీద కిరీటం లాంటి పించం (కుచ్చు) ఉంటుంది. పొడవాటి తోక మాత్రం మగపక్షికీ ఉండడం మరో విశేషం. ఆడ నెమలి గోధుమ రంగులో ఉండి నీలం, ఆకుపచ్చ మచ్చలు హృదయ భాగంలో కలిగి ఉంటుంది.నెమళ్ళ లో మూడు రకాలు ఉంటాయి. నీలపు నెమలి, ఆకు పచ్చ నెమలి, కొంగు నెమలి అనే రకాలు ఉంటాయి. శ్రీలంక, భారత్ దేశాలలో నీలపు నెమళ్లు కనిపిస్తాయి. జీవా ద్వీపంలో మయన్మార్ దేశంలో ఆకుపచ్చని నెమళ్లు తిరుగాడితే, ఆఫ్రికన్ వర్షా భాంత్ అడవుల్లో కాంగో నెమళ్ళు ఉంటాయి.
మగ నెమళ్ళను పీకాక్స్ అని, ఆడ నెమళ్ళను పీహేన్స్ అని, పిల్ల నెమళ్లను పీచిక్స్ అని అంటారు. నెమలి కుటుంబాన్ని పీహార్ అని నెమళ్ళ గుంపును పార్టీ అని లేదా ఫ్రెండ్ అని అంటారు.
నెమళ్లు చాలా పిరికి స్వభావం కలిగి ఉంటాయి. కుక్కలు, పిల్లలకు సైతం భయపడతాయి. శత్రువులు దాడి చేస్తున్నట్లు అనిపిస్తే పరుగెత్తుకొని పోయి చెట్లు ఎక్కే స్థాయి. శత్రుభయం పోయే వరకు రాత్రి అయినా కూడా చెట్ల మీదనే పడుకుంటాయి. నెమలి శరీరం అందంగా ఉన్న దాని అరుపు మాత్రం కర్ణకఠోరంగా, కీచుగా ఉంటుంది. దూరంగా ఎవరో ఆడమనిషి ఏడుస్తున్నట్లుగా ఉంటుంది దాని అరుపు.
నెమలి చెట్ల గుబుళ్ళ వెనుక నేలలోని గోతులు మాదిరి నేలను తవ్వి గూడు కట్టుకుంటుంది. గూడుకు రక్షణగా పుల్లలు పెడుతుంది. ఈ గుడిలోనే జనవరి నుండి అక్టోబర్ మాసాల మధ్య కాలంలో పలుచగా ఉండే క్రీము రంగు గుడ్లు తడవకు 3 నుంచి 5 వరకు పెడుతుంది.
నెమలి (Peacock) ధాన్యపు గింజలు, లేత మొక్కలు, పురుగులు, బల్లులు మరియు పాములు వంటివి తింటుంది. జనావాసాలకు దగ్గర గా ఉండాలంటే నెమళ్ళకు ఇష్టం. అలాగే ఆయా ప్రాంత వాసులు నెమళ్లను తమ సంతానం లాగా జాగ్రత్తగా చూసుకుంటారు. వీటిని మచ్చిక చేసి పెంచుకోవడం చాలా తేలిక.
COMMENTS