ప్రపంచంలో అత్యంత అందమైన పాముల గురుంచి తెలుసుకుందాం
Beautiful snakes in the world: మానవులు ప్రపంచంలో చాలా రకాలైన పాములను చూస్తుంటారు. వాటిలో కొన్ని విషపూరితమైనవి మరియు విషం లేనటువంటి పాములు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ బ్లాగ్ ద్వారా కొన్ని అందమైన పాముల గురించి తెలుసుకుందాం.1. అల్బినో Albino
ఆస్ట్రేలియా దేశంలో 2017 సంవత్సరంలో ఈ విచిత్రమైన పాము మనుషులు జీవించే ఇంటినివాసాల మధ్య కనిపించింది. దీని జాతి పేరు స్లాటి గ్రే. ఈ జాతికి చెందిన పాములన్ని గోధుమ రంగులోనే ఉంటాయి. కానీ ఈ పాము గోధుమ కలర్ లో ఉండదు.
2. రాయల్ బ్లాక్ అండ్ వైట్ స్నేక్
సెంట్రల్ ఆఫ్రికా మరియు వెస్ట్ ఆఫ్రికాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటి పొడవు ఆరు అడుగుల వరకు ఉంటుంది. ఇవి అత్యంత చిన్న పాములు. ఈ పాము ఏదైనా ప్రమాదాన్ని గుర్తించినట్లయితే తన శరీరాన్ని బంతి ఆకారంలో చుట్టుకొని ముడుచుకుపోతుంది. సీని బరువు చాలా తక్కువ మరియు చూడటానికి చాలా అందంగా ఉంటుంది.3. సానరాన్ హార్నెడ్ వైపర్ Sanaran Horned Viper
ఈ పాములు చూడటానికి డ్రాగెన్ లాగా కనిపిస్తాయి. వీటికి రెండు చిన్న, చిన్న కొమ్ములు ఉంటాయి. ఇవి ఉత్తరాఫ్రికా అడవుల్లో ఉంటాయి. వీటి పొడవు 1 నుంచి 2 అడుగులు మాత్రమే. ఎడారి ప్రాంతంలో పుట్టడం మరియు అక్కడే పెరగడం వలన ఇవి అన్ని ప్రాంతాలను ఇష్టపడతాయి. 20 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా ఇష్టపడతాయి. ఇవి వేటాడటానికి తమ శరీరాన్ని ఇసుకలో కప్పి ఉంచుతాయి.4. రైన్ బో స్నేక్ Rainbow Snake
ఈ జాతి పాములను రైన్ బో స్నేక్ అని పిలుస్తారు. పిలుస్తారు. ఎందుకంటే ఈ పాము అన్ని రంగులను కలిగి ఉంటుంది. అమెరికా లోని బోస్టన్ ప్రాంతంలో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. ఇవి విషం లేనటువంటి పాములు. ఇవి నీటిలో ఎక్కువ సమయాన్ని గడుపుతాయి. చేపలను,తొండలను ఆహారంగా తీసుకుంటాయి. వీటి వలన మనుషులకు ఎటువంటి హాని జరగదు. దీని కారణంగా అక్కడి ప్రజలు దీనిని పెంచుకుంటారు.5.ఐలాష్ వైపర్ Eyelash Viper
ఇవి పసుపు పచ్చ రంగులో చాలా అందంగా ఉంటాయి. వీటి పొడవు రెండు అడుగులు మాత్రమే ఉంటుంది. ఇవి చాలా చిన్నపాటి విషాన్ని కలిగి ఉంటాయి. వీటి వలన మనుషులకు పెద్దగా ప్రమాదం లేకపోయినా చిన్న ప్రాణులకు వీటి విషం చాలా ప్రమాదం.6. హై గ్రీన్ ట్రీ పైథాన్ High Green Tree Python
ఈ పాములు చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా చాలా పొడవైన దంతాలను కలిగిఉంటాయి. ఇవి కాటు వేయడం వలన మనిషికి చాలా నొప్పి కలుగుతుంది. దీనివలన ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటె ఈ పాములు విషపూరితం కాదు. నొప్పి ఎక్కువగా ఉంటుంది కానీ మనుషుల ప్రాణం పోవటం మాత్రం జరగదు.7. బ్లూ మలేషియన్ కోరల్ స్నేక్ Blue Malysian Coral snake
ఈ పాములు చాలా భయంకరమైన పాములు. మలేసియాలో నివసించే ఈ పాములు చాలా విషపూరితమైనవి. ఈ పాము కాటువేయగానే మరణం అనేది తొందరగా సంభవిస్తుంది. దీని విషానికి విరుగుడు ఇప్పటివరకు కనిపెట్టలేదు. ఆస్ట్రేలియాలోని ఒక శాస్త్రవేత్త ఈ పాము విషయానికి విరుగుడు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కప్పలు,బల్లులు మరియు మిగతా భయంకర పాములను తినడం ఈ పాములకు చాలా ఇష్టం. వీటి పొడవు 6 అడుగుల వరకు ఉంటుంది.
COMMENTS