నాగూర్ దర్గా (Nagore Dargah) గురించి తెలుసుకుందాం
Let us know about Nagore Dargah : నాగూర్ దర్గా భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన దర్గా లలో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ దర్గా తంజావూరు నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుంచి ఈ దర్గాకు వెళ్ళాలంటే ఐదు గంటల ప్రయాణం చేయవలసి ఉంటుంది. నాగూర్ దర్గా 500 సంవత్సరాలు కంటే ఎక్కువ పురాతనమైనది. ఈ దర్గా మొత్తం ఐదు ఎకరాల్లో ఉంది. ఈ దర్గా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే లోపల ఉన్న తలుపులు మాత్రం ఉదయంల 4 గంటల 30 నిమిషాల నుంచి నుండి 7 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల 25 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు తెరచి ఉంటాయి. ప్రతి శుక్రవారం మాత్రం అదనంగా ఈ దర్గా తలుపులు మధ్యాహ్నం12 నుంచి 2:30 మధ్య ఈ దర్గా తలుపులు తెరుస్తారు. దర్గా మొత్తం ఐదు మినార్లు ఉంటాయి. ఈ దర్గాకి ముస్లింలు మరియు హిందూ మత యాత్రికులు ఎక్కువగా వస్తుంటారు.
COMMENTS