గణతంత్ర దినోత్సవం (Republic day) ఎందుకు జరుపుకుంటారు?
Why Republic Day celebrated?:
ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటేే, 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగం రూపొందించడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ ని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది.
జనవరి 26 1950 న భారత రాజ్యాంగం దేశం మొత్తం అమలులోకి వచ్చింది. ఇది మనకు చాలా గర్వ కారణం. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగం ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి ఈ హక్కులు లభించాయి. మనం భారతదేశంలో స్వేచ్ఛగా, ధైర్యంగా బ్రతకడానికి మన దేశ సైనికులు మరియు మన దేశ స్వాతంత్ర్య పోరాట వీరులు ముఖ్య కారణం.
రాజ్యాంగం అమలులో ఉన్నప్పటికీ, నేటికి మన దేశంలో పేదరికం, అవినీతి, నిరుద్యోగులు, మహిళల భద్రత వంటి ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటిని అధిగమించడానికి మనం అందరం ఐక్యమత్యంతో కలిసి పోరాడాలి.
COMMENTS