Youtube కొత్త ఫీచర్: ఇక యూట్యూబ్ వీడియోలను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు
Youtube New Feature: Now you can download YouTube videos directly : యూట్యూబ్ తన వినియోగదారుల కోసం మంచి ఫీచర్ ను అందించింది. ఇప్పటి వరకూ యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడానికి తర్డ్ పార్టీ యాప్స్ కోసం వెతకాల్సివచ్చేది. అయితే, ఇప్పుడు యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ తో వీడియోలను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. యూట్యూబ్ ఈ ఫీచర్ ను ప్రయోగాత్మకంగా యాడ్ చేసింది మరియు ఈ ఫీచర్ కేవలం ప్రీమియం సబ్ స్క్రిబర్స్ ట్రై చెయ్యడానికి మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ కొత్త యూట్యూబ్ ఫీచర్ వివరాలను పూర్తిగా చూద్దాం.
Youtube లో ఈ కొత్త డైరెక్ట్ వీడియో డౌన్లోడ్ ఫీచర్ ను మొదటిగా ఆండ్రాయిడ్ పోలీస్ గుర్తించింది. అయితే, ఈ ఫీచర్ కేవలం అక్టోబర్ 19 వరకూ మాత్రమే అందుబాటులో ఉంది. ఎందుకంటే, ఇది ప్రయోగాత్మక ఫీచర్ కావడమే ఇందుకు కారణం మరియు Google ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను ప్రీమియం వినియోగదారుల కోసం టెస్టింగ్ కోసం అందించింది. కానీ, రానున్న కాలంలో దీనిని పూర్తిగా అమలు చేసే అవకాశం ఉంది.కొత్త డౌన్లోడ్ ఫీచర్ ను టెస్ట్ చెయ్యడానికి బ్రౌజర్ నుండి youtube.com/new పేజ్ ద్వారా ప్రయత్నించాలి. అయితే, Crome, Edge లేదా Opera Browser యొక్క లేటెస్ట్ వెర్షన్లో మాత్రమే ఈ ఫీచర్ సపోర్ట్ చేయబడుతుందని కూడా గమనించాలి. ఇక్కడ మీకు ప్రతీ వీడియో కూడా Download అప్షన్ తో కనిపిస్తాయి. ఇక్కడ నుండి మీకు కావాల్సిన వీడియోలను డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అయితే, ఈ ఫీచర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు ఈ ఫీచర్ ఎప్పటి వరకు యూట్యూబ్ కి అధికారిక ఫీచర్ గా వచ్చి చేరుతుంది విషయాన్ని వెల్లడించలేదు.
COMMENTS