మనిషి కంటికి దీటుగా పనిచేసే కెమెరా వచ్చేస్తోంది..! 2022
A camera that works against the human eye is coming : అందరికంటే ముందుగా హెవీ 108ఎంపి కెమెరాని ఆవిష్కరించిన కంపెనీ శాంసంగ్. అంతేకాదు, ఆ సమయంలో ప్రపంచం మొత్తం మీద అదే అతిపెద్ద సెన్సార్. అయితే, ఇప్పుడు ఈ కంపెనీ మనిషి కంటికి దీటుగా పనిచేసే భారీ కెమెరాని తయారు చెయ్యడానికి సిద్మవుతోంది.
అంతేకాదు, 2025 నాటికల్లా 600MP సెన్సార్ ని ప్రకటించాలని చూస్తోంది. ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇటీవల కూడా "Samsung ISOCELL HP1" అని పిలవబడే 200MP స్మార్ట్ఫోన్ కెమెరా సెన్సార్ను ఆవిష్కరించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇది మాత్రమేకాదు, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లో ఆటోమోటివ్ సెన్సార్ వైస్ ప్రెసిడెంట్ అయిన హీచాంగ్ లీ.రానున్న సంవత్సరాల్లో మానవ నేత్రానికి సమానమైన 576 MP భారీ సెన్సార్ ని విడుదల చెయ్యవచ్చని ప్రకటించారు.
SAMSUNG 576MP సెన్సార్ విశేషాలు:
నిజానికి శాంసంగ్ తీసుకురావాలని చూస్తున్న ఈ 576ఎంపి కెమెరా స్మార్ట్ ఫోన్ ల కోసం అయితే కాదు. మరి దేనికోసం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా..! ఒక ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం, ఈ Samsung 576MP సెన్సార్ ని ఆటోమొబైల్స్ రంగం కోసం ఆవిష్కరించబోతోంది. అంతేకాదు, మానవ నేత్ర సామర్ధ్యాన్ని మించిన కెమెరా సెన్సార్ ను తయారు చేయాలనే తన ఆశయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించింది.
నానాటికి స్వయంప్రతిపత్తమైన(ఆటోనామస్) కార్ల సామర్థ్యాలు పెంచడానికి కంపెనీలు కృషిచేస్తుండగా, విషయాలను అత్యంత వేగంగా కాప్చర్ చెయ్యడానికి ఈ కెమెరాలు సహాయపడతాయి. 600ఎంపి కెమెరా సెన్సార్ 0.8µm పిక్సెల్లను కలిగి ఉంటుంది మరియు 1/.0.57 తో సైజులో పెద్దగా ఉబ్బెత్తుగా వుంటుంది. భవిష్యత్తులో స్వయంప్రతిపత్త వాహనాల విభాగం, IoT డివైజెస్ మరియు డ్రోన్లలో తన సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి శాంసంగ్ ఆసక్తి చూపుతోంది.
COMMENTS