ఆవాల నూనెతో కలిగే ప్రయోజనాలివే
These are just some of the benefits of using mustard oil: ఆవాల నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆవాల నూనెలో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
అలాగే ఒమేగా త్రీ, లెనో లినిక్ యాసిడ్ వంటివి కూడా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు
ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆవాల నూనెను ప్రతిరోజూ తీసుకుంటే అనారోగ్య
సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.
ఆవాల నూనె వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- ఆవాలు నూనెలో ఉండే మంచి ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
- ఆవాల నూనె చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
- రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలానే స్వెల్లింగ్ సమస్యలను తగ్గిస్తుంది.
- దగ్గు, జలుబు, అలర్జీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- ఆవాల నూనె యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.
- రెడ్ బ్లడ్ సెల్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుతుంది.
- ఆవాల నూనెతో పిల్లకు మసాజ్ చేస్తే వారి ఎముకలు దృఢంగా మారుతాయి.
- జుట్టు పోషణలో ఆవాల నూనె అద్భుతంగా పని చేస్తుంది. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- ఆవాల నూనెతో మసాజ్ చేయడం ద్వారా చర్మ సమస్యలు దూరమవుతాయి.
COMMENTS