పుదీనాతో శ్వాసకోశ సమస్యలు మటుమాయం
Remedies for Respiratory problems with mint: మనం నిత్యం వంటల్లో ఉపయోగించే
పుదీనాతో బోలెడు ప్రయోజనాలున్నాయి. ఔషద గుణాలతో కూడిన పుదీనాతో ఎన్నో శ్వాసకోశ
సమస్యలు, గొంతు సంబంధిత సమస్యలు చిటికెలో మాయమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఏడాది పొడవునా, నిరంతరాయంగా పుదీనా విరివిగా లభిస్తుంది. దీని వల్ల ఉపయోగాలు ఏమిటో
చాలా మందికి తెలియవు. పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకోవాలని
నిపుణులు సూచిస్తున్నారు.
పుదీనాలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి.
విటమిన్ ఏ, సీ, డీ, బీ కాంప్లెక్స్ విటమిన్లు పుదీనాలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి
చర్మ సంరక్షణకు ఎంతో దోహద పడతాయి. మాంగనీస్, పొటాషియం, ఐరన్ వంటివి అధిక
మొత్తంలో లభిస్తాయి. శరీరంలో రక్తం పెరుగుతుంది. మెదుడు పనితీరు మెరుగై, ఆహారం
త్వరగా జీర్ణమవుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఆహారం జీర్ణం త్వరగా అవుతుంది. ఫలితంగా
జీర్ణవ్యవస్థ ప్రక్రియ బాగా మెరుగుపడుతుంది. ఆస్తమాని అదుపులో పెట్టుకోవడానికి,
తలనొప్పిని గణనీయంగా తగ్గించడానికి ఇది దోహదకారి. నుదుటిపై పుదీనా రసంతో మసాజ్
చేస్తే తలనొప్పి తక్షణమే తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి నుంచి దూరం అయ్యేందుకు సైతం పుదీనా వాసన చూస్తే చాలని నిపుణులు
పేర్కొంటున్నారు. దీనిపై పరిశోధనలు సైతం ఇదే తేల్చి చెప్పాయి. జీర్ణక్రియ
మెరుగుపరిచే ఔషదగుణాలున్న పుదీనాతో బరువు కూడా తగ్గవచ్చని అభిప్రాయాలున్నాయి.
పుదీనాలో సహజంగా ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఫలితంగా సహజసిద్ధంగా
బరువు తగ్గవచ్చని పరిశోధనలు తెలుస్తోంది.
COMMENTS