చలికాలం ఖర్జూరం తింటే కలిగే ప్రయోజనాలివే
These are the benefits of eating dates in winter:
- చలికాలం ఖర్జూరం తింటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు
ఎక్కువగా లభిస్తాయి.
- ఎముక ఆరోగ్యానికి విటమిన్ డి కీలకం.
చలికాలంలో శరీరానికి తగినంత ఎండ తగలక పోవటం వల్ల విటమిన్ డి లోపించే అవకాశముంది.
అందుకే క్యాల్షియంతో నిండిన ఖర్జూరంతో దీన్ని నివారించుకోవచ్చు.
- చలికాలంలో కీళ్లనొప్పులను ఖర్జూరంలోని నొప్పి నివారణ గుణాలు కొంతవరకు
తగ్గిస్తాయి. మెగ్నీషియం సైతం నొప్పులు, బాధలు తగ్గటానికి తోడ్పడుతుంది.
- చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గడంతో గుండెపోటు ముప్పు పెరిగే అవకాశం ఉంది.
అందుకే ఖర్జూరం తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు, అధిక రక్తపోటు
ముప్పులు తగ్గుముఖం పడతాయి.
- ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల ఇది తింటే హిమోగ్లోబిన్ స్థాయులు
మెరుగవుతాయి. రక్తహీనత తగ్గుముఖం పడుతుంది.
- ఖర్జూరంలో నీటిలో కరిగే, కరగని రెండు రకాల పీచూ ఉంటుంది. ఇది జీర్ణకోశ వ్యవస్థ
సక్రమంగా పనిచేయటానికి, మలబద్ధకం దరిజేరకుండా ఉండటానికి తోడ్పడుతుంది.
- తరచుగా ఖర్జూరం తింటే చర్మానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
- ఎక్కువసేపు వ్యాయామాలు చేస్తున్నట్టయితే ఖర్జూరంతో పాటు బాదం, జీడిపప్పు వంటి
గింజపప్పులనూ తినటం మంచిది. ఇవి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తూ త్వరగా
అలసిపోకుండా కాపాడతాయి.
COMMENTS