అక్కడ తల్లి పాలే చిన్నారులకు ప్రమాదకరంThere Mother Milk is dangerous for babies
అప్పుడే పుట్టిన చిన్నారులకు తల్లిపాలు తప్పక అందించాలని వైద్యులు చెబుతుంటారు. చిన్నారులకు మెరుగైన రోగ నిరోధక శక్తి అందించేవి తల్లిపాలే. ప్రపంచంలో కల్తీ లేనివి తల్లి పాలేనని అందరూ భావిస్తారు. అయితే మన దేశంలోని ఓ ప్రాంతంలో తల్లి పాలే చిన్నారులకు ప్రమాదకరంగా మారాయి. అక్కడ మహిళల అందించే పాలలో అత్యంత ప్రమాదకర విషపూరిత ఆనవాళ్లు ఉన్నట్లు ఓ పరిశోధన వెల్లడించింది. వాటిని తాగితే చిన్నారులకు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బీహార్ రాష్ట్రంలో గంగానది వెంబడి ఉండే ఆరు జిల్లాలలో కొందరు పరిశోధనకులు జరిపిన పరిశోధన ఆధారంగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తల్లి పాలలో ఆర్సెనిక్ శాతం 0.2 నుంచి 0.6 మైక్రోగ్రాములు మాత్రమే ఉండాలని, అలాంటివే తాగేందుకు మంచివని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే బీహార్లోని బక్సార్ సహా వైశాలి, పాట్నా, భోజ్పుర్, సరన్, వైశాలి, బాగల్పుర్ జిల్లాలలోని మహిళల పాలలో 495.2 మైక్రో గ్రాముల ఆర్సెనిక్ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. సాధారణంగా శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లి పాలే తాగిస్తారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అలా చేయడం వల్ల చిన్నారులు కేన్సర్, కాలేయం, కిడ్నీ, గుండె, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
COMMENTS