చర్మంపై ముడతలా? ఇలా చేయండి! Wrinkles on the skin? Do it like this!
వయసు పైబడుతోందని చెప్పడానికి కనిపించే లక్షణాల్లో చర్మం ముడతలు పడటం ముఖ్యమైనది. అయితే చర్మంపై ముడతలు రావడానికి వయసు పెరగడం ఒక్కటే కారణం కాదు. సౌందర్య సంరక్షణలోను, మన జీవన విధానాల్లోనూ చేసే కొన్ని పొరపాట్లు కూడా అందుకు కారణమవుతాయి.
బయట ఎండలో తిరిగేటప్పుడు చర్మం సూర్యరశ్మి వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అందుకే ఎండలోకి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి.
ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు అవసరమైతే మేకప్ వేసుకుంటాం. తిరిగి వచ్చాక మేకప్ తొలగించుకుని ముఖాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే మేకప్ ఉత్పత్తుల్లో ఉండే ఫ్రీ రాడికల్స్, కాలుష్య కారకాలు చర్మం మీద ప్రభావం చూపించి ముడతలు పడేలా చేస్తాయి. కాబట్టి మేకప్ తో నిద్రకు ఉపక్రమించడం మంచిది కాదు.
చర్మంపై ముడతలు రావడానికి మన శరీర బరువులో వచ్చే మార్పులు కూడా కారణం కావచ్చు. ఒకేసారి బరువు తగ్గడం లేదా పెరగడం వంటివి జరిగితే స్ట్రెచ్మార్క్స్ రావడంతో పాటు చర్మం సాగినట్లుగా, ముడతల్లా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు మరీ తక్కువగా లేదా ఎక్కువగా కాకుండా తగినంత ఉండేలా జాగ్రత్తపడాలి.
చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పళ్లు, కూరలు మన ఆహారంలో భాగం కావాలి. ఎందుకంటే అవి చర్మంపై బాగా ప్రభావం చూపిస్తాయి. వార్థక్యపు ఛాయలు కనిపించకుండా చేస్తాయి. ఎప్పుడైతే చర్మ సంరక్షణకు అవసరమయ్యే పోషకాలు అందవో అప్పుడు ఆ ప్రభావం తప్పకుండా చర్మం మీద కనిపిస్తుంది.
Wrinkles on the skin? Do it like this!
నిద్రపోయేటప్పుడు మనం ఎలా పడుకుంటున్నాం అన్నది కూడా చర్మంపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఎక్కువమంది పక్కకు తిరిగి పడుకుంటారు. అయితే ఇలా పడుకున్నప్పుడు ముఖానికి, తలగడకు జరిగే రాపిడి వల్ల ముఖచర్మంపై సన్నని గీతలు ఏర్పడతాయి. క్రమంగా ఇవి ముడతలుగా కూడా మారే అవకాశాలు ఉంటాయట. అందుకే పక్కకు తిరిగి కాకుండా వెల్లకిలా పడుకోవడం ఉత్తమం.ప్రస్తుతం రకరకాల కారణాల దృష్ట్యా నిద్రా సమయం తగ్గిపోతోంది. ఫలితంగా ముఖంపై ఉండే చర్మ కణాలు అలసిపోయి, చర్మం ముడతలు పడటానికి కారణం అవుతోంది. అందుకే రోజూ 8గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
ఉన్నచోటే అదే పనిగా కూర్చుని ఉండొద్దు. వ్యాయామం చేయకపోతే ఆ ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
COMMENTS