చేయి చూపిస్తే చాలు అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్
Money transfer from the account is enough to show the hand : ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా పుంజుకుంటుంది. బ్యాంకింగ్ రంగం నుంచి మొదలుకొని అన్ని రంగాలలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకు కి వెళ్లాల్సి వచ్చేది. రాను రాను బ్యాంకింగ్ సిస్టమ్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ATM కార్డుల ద్వారా మెషిన్ల నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కరోనా కారణంగా ఇంకా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. యాప్ల ద్వారా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసుకొనే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అయితే రానున్న కాలంలో ఇది కనుమరుగుకానుంది.
బ్రిటీష్ పాలిష్ స్టార్టప్ వాలెట్మోర్ కంపెనీ ఇంకొక అడుగు ముందుకు వేసి కొత్త ఫీచర్ను తెచ్చింది. ఈ కొత్త ఫీచర్లో చెల్లింపులు కేవలం చేతి ద్వారానే జరుగుతాయి. ఇందుకోసం ముందుగా మనిషి బాడీలోకి చార్జింగ్ అవసరం లేని పేమెంట్ చిప్లను ఇంజెక్షన్ ద్వారా పంపుతారు. దీనిని ఎక్కడైతే అమర్చారో అక్కడే స్థిరంగా ఉంటోంది. ఈ చిప్ బరువు ఒక గ్రాము కంటే తక్కువగా ఉంటుంది. ఈ చిప్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్సీ) టెక్నాలజీపై పనిచేస్తుంది. కాంటాక్ట్లెస్ పేమెంట్లకు వాడే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని దీనికి వాడుతున్నారు.
ఈ చిప్ల సాయంతో షాపులలో, మాల్స్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా క్యాష్ అవసరం లేకుండా యూజర్లు తమ చేయిని కాంటాక్ట్లెస్ పేమెంట్ మెషిన్ వద్ద ఉంచితే అవతలి వారికి మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పటి వరకు 500కి పైగా పేమెంట్ చిప్లను విక్రయించారు. ఈ పేమెంట్ విధానం పూర్తిగా సురక్షితమైనదని, అవసరమైన అన్ని అథారిటీల నుంచి ఈ చిప్ పేమెంట్ల కోసం ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది.
COMMENTS